నిరసన గళం
● 108 సిబ్బంది, ఆశా వర్కర్ల ఆందోళన బాట
తుమ్మపాల: తమ డిమాండ్లు నెరవేర్చాలని, సమస్యలు తీర్చాలని 108 సిబ్బంది, ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద సోమవారం నిరసన తెలిపారు. 108 సిబ్బంది ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ప్రమాదాలు జరిగిన నిమిషాల్లో ప్రజలకు సేవలందించే తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించాలని, 8 గంటల పని సమయాన్ని 3 షిప్టులలో పెట్టాలని, ఈఎంటీలను నియమించాలని, మరణించిన ఉద్యోగికి రూ.25 లక్ష ల ఎక్స్‌గ్రేషియా అందించాలని వినతి అందించారు.
ఆశా వర్కర్ల నిరసన
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, పనిభారం తగ్గించాలని, పాడైన సెల్ ఫోన్లు స్థానంలో కొత్త 5 జి సెల్ ఫోన్లు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు, తొలగొంపులు ఆపాలని, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు, మెడికల్ లీవులు, నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని, ఏఎన్‌ఎం నియామకాల్లో ఆశాలకు వేయిటీజీ మార్కులు ఇవ్వాలని, ఆశాల ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ పార్వతి, కె.శాంతి, రాష్ట్ర కార్యదర్శి వి.సత్యవతి, జిల్లా కార్యదర్శి కె.వరలక్ష్మి, బి.రామలక్ష్మి, అరుణ, కె.లక్ష్మి, చిట్టెమ్మ, కనకమహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment