మిగులు భూమిని స్వాధీనం చేసుకోవాలి
మాకవరపాలెం : ఆన్‌రాక్ రిఫైనరీకి కేటాయించగా మిగిలిఉన్న భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని శెట్టిపాలెం, భీమబోయినపాలెం సర్పంచ్‌లు అల్లు రామునాయుడు, రుత్తల నందకిషోర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో డీటీ కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఆన్‌రాక్ రిఫైనరీ నిర్మాణం కోసం 2008లో రాచపల్లి, జి.కోడూరు, తామరం, భీమబోయినపాలెం రెవెన్యూ పరిధిలోని సుమారు 2400 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. ఇందులో ఆన్‌రాక్‌కు ఇవ్వగా మిగిలిన భూమి కూడా ఆన్‌రాక్ స్వాధీనంలోనే ఉందన్నారు. దీనిపై అధికారులు విచారణ చేసి, రిఫైనరీకి కేటాయించగా మిగిలి ఉన్న భూమిని ఆన్‌రాక్ యాజమాన్యం నుంచి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment