రైతుల కష్టాలు తీర్చింది జగనన్నే
● తాచేరు వంతెన, రోడ్డు నిర్మాణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.7.4 కోట్ల మంజూరు ● పనులు పూర్తికావడంతో పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ● కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులకు అభినందనలు
మాడుగుల : రైతుల కష్టాలు తీర్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.7.4 కోట్లు మంజూరు చేయడంతో తాచేరు వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తయ్యిందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని అనేక గ్రామాల ప్రజలు, రైతులు మాడుగుల చేరుకునేందుకు ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన సురవరం వచ్చి వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు రోడ్డు, వంతెన నిర్మాణానికి తాను శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. ఒప్పందం పూర్తికాక ముందే డి.గొటివాడ నుంచి మాడుగుల దేవీ ఆలయం వరకు రోడ్డుతోపాటు తాచేరుపై వంతెనను కాంట్రాక్టర్ వెంకటసుబ్బయ్య నాణ్యతతో నిర్మించారని అభినందించారు. పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంత రైతులతోపాటు తాచేరు ఇవతల గ్రామాల ప్రజలు, రైతుల కష్టాలు తీరాయన్నారు. వంతెన నిర్మించాలని గత పాలకులను రైతులు చాలా సార్లు కోరినప్పటికీ అప్పట్లో పూర్తి చేయలేదన్నారు. ఈ సమస్య తన దృష్టికి రావడంతో రెతుల కష్టాలు స్వయంగా చూసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించానన్నారు. ఎన్నికలకు ముందే దాదాపు రోడ్డు నిర్మాణం పూర్తయిందని, ప్రస్తుతం వంతెన పనులు పూర్తయ్యాయన్నారు. అలాగే ఘాట్‌రోడ్ నుంచి కింతలి వరకు 9.6 కిలోమీటర్ల రోడ్డుకు రూ.9 కోట్లు మాజీ సీఎం జగన్ పాలనలో మంజూరు చేయడంతో ఆ పనులు ఎన్నికలకు ముందే పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో సీసీ రోడ్లు నాణ్యతతో నిర్మిస్తున్నారన్నారు. చాలా ఏళ్లుగా మాడుగులలో అతిథి గృహం లేకపోవడంతో సర్వాంగ సుందరంగా తన హయాంలోనే నిర్మించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులకు సౌకర్యంగా ఉందన్నారు. ఘాట్‌రోట్ నుంచి మాడుగుల వచ్చే మార్గంలో తాచేరుపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన వంతెన శిథిలమైందని, కొత్తగా మేము నిర్మించిన వంతెన మండల వాసులకు ఆధారంగా మారుతుందన్నారు. వంతెన నిర్మాణం పూర్తికావడంతో పాడేరు నుంచి మాడుగులకు ఆర్‌టీసీ బస్సులు నడపడానికి స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు.
అనంతరం నాణ్యతతో పనులు వేగవంతంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ను, ఇంజినీరింగ్ అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యురాలు కిముడు రమణమ్మ, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, మాడుగుల సర్పంచ్ ఎడ్ల కళావతి, కో ఆప్సన్ మెంబరు షేక్ ఉన్నీఫా, వైఎస్సార్ సీపీ నాయకులు గొళ్లవిల్లి సంజీవరావు, దేవరాపల్లి శ్రీనివాసరావు, పడాల అప్పలనాయుడు, కోరుకొండ చెల్లంనాయుడు, సయ్యపురెడ్డి నారాయణరావు, బొద్దపు భాస్కరరావు, అల్లంగి సంజీవరావు, ససర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment