సీపీఎస్‌కు వ్యతిరేకంగా 10న భారీ బహిరంగ సభ
సీపీఎస్‌పై ఉద్యోగుల బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కోరుకొండ సతీష్
అనకాపల్లి : సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా జీపీఎస్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు సీపీఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో భారీ బహిరంగ సభ గోడపత్రికలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ విషయమై మాట్లాడడం లేదన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను ప్రకటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రొంగల అప్పలనాయుడు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి బోయిన చిన్నారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment