1800 లీటర్ల సారా పులుపు ధ్వంసం
నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊటను ధ్వంసం చేస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది
చోడవరం రూరల్ : నాటుసారా అక్రమ తయారీ, రవాణా, అమ్మకాల పట్ల ఉక్కుపాదం మోపే చర్యల్లో భాగంగా సోమవారం 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను, నాటుసారీ తయారీ బట్టీలను ధ్వంసం చేసినట్టు చోడవరం ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కె..వి.పాపునాయుడు తెలిపారు. బుచ్చియ్యపేట మండలం గంటి కొర్లాం గ్రామం కేంద్రంగా నాటుసారా తయారు చేసి రావికమతం, మాడుగుల, బుచ్చియ్యపేట, చోడవరం మండలాల్లోని పలు గ్రామాలకు సరఫరా అవుతున్నట్టు తమ నిఘాలో తేలిందన్నారు. దీంతో గంటికొర్లాం గ్రామ శివారు ప్రాంతాల్లో ఎస్‌ఐ ఎం.శేఖరం, హెడ్ కానిస్టేబుల్ ఎం.అప్పారావు సిబ్బందితో కొండ ప్రాంతాల్లో విస్తృత గాలింపు చేపట్టి 1800 లీటర్ల ఊట, సారాబట్టీని కనుగొని వాటిని ధ్వంసం చేసినట్టు సీఐ తెలిపారు. కాగా తమ దాడులను పసిగట్టి నిర్వాహకులు పరారయ్యారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment