ఫిజియో థెరపీతో మానసిక ఒత్తిడి దూరం
● నిజాం ఫిజియోథెరపీ ఇనిస్టిట్యూట్ వైద్యుడు డా.రమేష్ ● కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులకు శిక్షణ
ఫిజియోథెరపిపై శిక్షణ ఇస్తున్న నిజాం ఫిజియోథెరపీ ఇనిస్టిట్యూట్ వైద్యుడు డా. రమేష్
దేవరాపల్లి : విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు ఉద్యోగులంతా ఫిజియోథెరపి సాధన చేయాలని నిజాం ఫిజియోథెరపీ ఇనిస్ట్యూట్ వైద్యులు డా.రమేష్ సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎం.వి. సువర్ణరాజు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులకు ఫిజియోథెరపిపై సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫిజియోథెరపీతో ఒత్తిడిని అధిగమించి, తద్వారా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చునని వివరించారు. ఫిజియోథెరపి విధానాన్ని చేసి చూపించడంతో పాటు పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ పరిపాలన అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment