సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టర్ల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో పనులు నిర్వహించే కాంట్రాక్టు సంస్థ యజమానుల నుంచి రెండు రోజుల క్రితం పూణేలో లంచం తీసుకుంటూ సీబీఐకి డీఆర్‌ఎం చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలతో దర్యాప్తు బృందం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో డీఆర్‌ఎం పేరుని ఏ1గా చేర్చింది. ముంబైకి చెందిన డీఎన్ మార్కెటింగ్ సంస్థ ప్రొప్రైటర్ సనిల్ రాథోడ్‌ని ఏ2గా, పూణేకి చెందిన హెచ్‌ఆర్‌కే సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఆనంద్‌భగత్‌ని ఏ3గా, హెచ్‌ఆర్‌కే సొల్యూషన్స్, గుజరాత్‌కు చెందిన హిందూస్థాన్ ఫైబర్ గ్లాస్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని ఏ4, ఏ5లుగా చేర్చింది. సౌరభ్‌కుమార్‌తో పాటు మిగిలిన వ్యక్తులు, సంస్థలపై సెక్షన్ 61(2) ఆఫ్ బీఎన్‌ఎస్ 2023, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 7, 8, 9, 10, 12 నమోదు చేసినట్లు సీబీఐ ఢిల్లీ ఏసీ–1 కార్యాలయ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుమన్‌కుమార్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. తదుపరి విచారణ బాధ్యతల్ని సీబీఐ ఏసీ–1 సీఐ భన్వేంద్ర చౌదరి కొనసాగిస్తారని ఎస్‌పీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment