పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు మరింత సహకారం
● అసిస్టెంట్ రిజిస్ట్రార్ గీతావాణి
కె.కోటపాడులో సహకార పతకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ గీతావాణి
కె.కోటపాడు : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా సభ్య రైతుల సంక్షేమానికి కృషి చేయనున్నట్టు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.గీతావాణి అన్నారు. 71వ అఖిత భారత సహకార వారోత్సవాల్లో భాగంగా కె.కోటపాడు పీఏసీఎస్ ఆవరణలో సోమవారం సహకార పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటుతో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ జరుగుతుందని, తద్వారా రైతులకు మరింత వేగవంతంగా సొసైటీ సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ అధికారి సోమేశ్వరరావు, కె.కోటపాడు, చౌడువాడ, ములకలాపల్లి సొసైటీల సీఈవోలు ఆర్.చిన ఈశ్వరరావు, బి.సత్యనారాయణమూర్తి, ఎం.వెంకటరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment