● విద్యాసంస్థలకు కలెక్టర్ హెచ్చరిక
తుమ్మపాల: విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని ఇబ్బందులు పెడితే సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజును రీయింబర్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిందని, త్వరలోనే చెల్లిస్తారని స్పష్టం చేశారు. ఫీజులు చెల్లించలేదన్న నెపంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరగతులకు అనుమతించకపోవటం, హాల్‌టికెట్లు జారీ చేయకపోవటం, పరీక్షలు రాయనీయకపోవటం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి పరీక్ష ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చిందని, విచారణలో నిజమని తేలితే సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment