దేవరాపల్లి/చీడికాడ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో వరి సాగు చేసిన రైతులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్‌రావు సూచించారు. ఆయన గురువార దేవరాపల్లి మండలంలోని కలిగొట్ల, బోయిలకింతాడ గ్రామాల్లోనూ, చీడికాడ మండలం తునివలస, చుక్కపల్లి, పెదగోగాడ, జి.కొత్తపల్లి గ్రామాల్లో క్షేత్ర స్థాయిల్లో పర్యటించి రైతులకు సూచనలు చేశారు. వరికోతలు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోతలు పూర్తి చేసిన వారు పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించి, కుప్పలు పెట్టుకుని, గాలికి ఎగిరిపోకుండా టర్పాలిన్లు మూసి వాటిపై బరువు ఉంచాలని తెలిపారు. వరి కోతలు వాయిదా వేయాలని రైతులకు వివరించాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఆయా మండల వ్యవసాయాధికారులు, మండల విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment