సారా తయారీకి బెల్లం అమ్మకాలు చేయరాదు
అనకాపల్లి: బెల్లం వ్యాపారి ఒకేసారి 4 వేల క్వింటాళ్ల బెల్లం కంటే అధిక బెల్లం నిల్వ ఉంచరాదని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమీషనర్ సూర్జిత్ సింగ్ అన్నారు. స్థానిక జిల్లా వర్తక సంఘం ఆధ్వర్యంలో జిల్లా బెల్లం వర్తకులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీయూఆర్ రెగ్యులేషన్ ఆర్డర్ 1968 ప్రకారం వర్తకులంతా ప్రతినెలా మొదటి వారంలో నెలవారి బెల్లం క్రయవిక్రయాలకు సంబంధించిన రిపోర్టు సమర్పించాలని ఆయన కోరారు. ప్రతి వ్యాపారి లైసెన్స్ కలిగిన వ్యక్తులు మాత్రమే వ్యాపారం చేయాలన్నారు. వ్యాపారులు ఎవరూ నాటు సారా తయారీదారులకు గాని నాటుసారా తయారు చేసే వ్యక్తులకు బెల్లం సరఫరా చేసే వ్యాపారులకు గాని బెల్లం అమ్మరాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి వి.సుధీర్, అనకాపల్లి ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వై.లక్ష్మణ నాయుడు, జిల్లా బెల్లం వర్తకుల సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మినారాయణ(పెదబాబు), బెల్లం వ్యాపారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment