అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య! | - | Sakshi
Sakshi News home page

అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!

Published Fri, Nov 29 2024 2:06 AM | Last Updated on Fri, Nov 29 2024 2:06 AM

అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!

అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

నర్సీపట్నం: నర్సీపట్నం మండలం గురందరపాలెంలోని అత్తవారి తోటలో అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రూరల్‌ ఎస్సై రాజారావు అందించిన వివరాలు.. జె.ప్రసాద్‌ (38) అనకాపల్లిలో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురందరపాలేనికి చెందిన ధనలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తలు గత కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ధనలక్ష్మి గురందరపాలెంలోని అమ్మవారి ఇంటి వద్ద ఉంటోంది. బుధవారం రాత్రి ప్రసాద్‌ గురందరపాలెం వచ్చాడు. ఊరి చివరిలో ఉన్న అత్తవారికి చెందిన తోటలో చెట్టుకు ప్లాస్టిక్‌ తాడుతో ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. సంఘటన స్థలంలో అతని ద్విచక్ర వాహనం ఉంది. మద్యం సీసా కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement