రైలు ఢీకొని మహిళ దుర్మరణం
యలమంచిలి రూరల్: రేగుపాలెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో డౌన్‌లైన్‌లో రైలు ఢీకొని గురువారం యలమంచిలి మండలం పేట బయ్యవరం గ్రామానికి చెందిన కొయ్య లక్ష్మి(36) మృతి చెందింది. అవివాహిత అయిన లక్ష్మి బయ్యవరంలో మేనమామ ఇంటివద్ద ఉంటోంది. గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తుండగా రైలుపట్టాలు దాటుతున్న సమయంలో హౌరా సూపర్ ఫాస్ట్ ప్రెక్స్‌పెస్ రైలు ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను మేనమామ కుమారుడు కిల్లాడి అప్పలనాయుడు గమనించి భుజాలపై వేసుకుని గ్రామంలోకి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం ఆటోలో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. తలకు బలమైన గాయమై అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను పరీక్షించిన డ్యూటీ డాక్టర్ అప్పటికే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు చెప్పారు. మతిస్థిమితంలేని కారణంగా లక్ష్మి కొంతకాలంగా విశాఖపట్నం మానసిక చికిత్సాలయంలో వైద్యం చేయించుకుంటోందని కుటుంబ సభ్యులు తుని రైల్వే పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుని రైల్వే పోలీసులు ప్రమాద స్థలానికి వచ్చి ప్రమాదంపై ఆరా తీశారు. బహిర్భూమికి వెళ్లి వస్తున్న లక్ష్మి రెండు రైల్వే లైన్లపై నుంచి ఆ సమయంలో రెండు రైళ్లు ఒకేసారి రావడంతో తికమకపడి మధ్యలో ఉండిపోవడంతో ప్రమాదానికి గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి మేనత్త నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి. శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment