అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యుపీఎస్)ను తీసుకు రావడాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని యూటీఎఫ్ జిల్లా కమిటీ తేల్చి చెప్పింది. సీపీఎస్ రద్దు చేయకుండా యూపీఎస్ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంపై సోమవారం యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెబెక్స్ నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ యూపీఎస్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఈ నెల 30న జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రమణయ్య, సహాధ్యక్షులు సరళ, రామప్ప, కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, రాష్ట్ర కౌన్సిలర్ ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శులు ప్రమీల, హనుమంతరెడ్డి, అర్జున్, రవికుమార్, సంజీవ్ కుమార్, అబ్దుల్ వహబ్, రఘురామయ్య, శేఖర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ సుబ్బరాయుడు పాల్గొన్నారు.
యూటీఎఫ్ డిమాండ్
30న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన
Comments
Please login to add a commentAdd a comment