జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఈ
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం
అనంతపురం అర్బన్: సమస్యలపై ప్రజలు సమర్పించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్ అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 383 వినతులు అందాయి.
వినతుల్లో కొన్ని..
● తన తల్లి ఎస్.పెద్దక్క పేరున ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో తొలగించారంటూ కుమారుడు సతీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. శింగనమల మండలం అలంకారయునిపేట పొలం సర్వే నంబరు 403–8లో 3.78 ఎకరాల భూమికి 1977లో తన తల్లిపేరున డి.పట్టా ఇచ్చారని, ఇందుకు పాసుపుస్తకం కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం అడంగల్‌లో కేవలం 70 సెంట్లు మాత్రమే చూపిస్తున్నారని వాపోయారు. మండల అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే తమకు చావే శరణ్యమని ఆవేదన చెందారు.
● తన ప్లాట్‌ను ఆక్రమించారని ఎ.నారాయణపురం పంచాయతీ స్టాలిన్ నగర్‌కు చెందిన బి.పక్కీరప్ప ఫిర్యాదు చేశారు. నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామ సర్వే నంబరు 95/2లో తన 56వ ప్లాట్‌ను ఇద్దరు వ్యక్తులు ఆక్రమించారని చెప్పారు. విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు.
● ఉరవకొండ పంచాయతీ అధికారులు తన తల్లి మరణధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అనంతపురం గుల్జార్‌పేటకు చెందిన రాజమన్నారు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసి మూడు నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment