అనంతపురం సిటీ: పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని పంచాయతీరాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బి.బాలు నాయక్‌ను సోమవారం కలసి విన్నవించారు. మహిళలు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మండలాలకే పరిమితమైన ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్ఈ కార్యాలయంతో పాటు అనంత పురంలోని సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన పీఏలు, సూపరింటెండెంట్లు, ఇతర క్యాడర్ల ఉద్యోగులందరినీ మండలాలకు పంపాలని కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానంటూ ఈఎన్సీ వారికి హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు రాచంరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డీఎల్ మురళీ, కోశాధికారి పాండురంగారెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మీనా రాయణ, డీఈఈ భరత్ ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment