నేటి నుంచి విత్తన పప్పుశనగకు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: నల్లరేగడి భూముల్లో రబీ పంటగా పప్పుశనగ సాగు చేసే రైతులకు రాయితీ విత్తన పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో గురువారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో (ఆర్‌ఎస్‌కే) రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రకటించారు. ఏపీ సీడ్స్ ద్వారా విత్తన సేకరణ, సరఫరా చేయగానే ఈనెల 10లోపు పంపిణీ మొదలు పెట్టవచ్చని చెబుతున్నారు. జిల్లాకు కేటాయించిన 27,139 క్వింటాళ్లను సాగు విస్తీర్ణంను బట్టి మండలాల వారీగా విత్తన కేటాయింపులు చేశారు. అత్యధికంగా పుట్లూరు మండలానికి 3,400 క్వింటాళ్లు కేటాయించగా, గార్లదిన్నెకు అత్యల్పంగా 50 క్వింటాళ్లు ఇచ్చారు. మొత్తంగా తాడిపత్రి డివిజన్‌కు 8,100 క్వింటాళ్లు, ఉరవకొండ డివిజన్‌కు 6,900 క్వింటాళ్లు, రాయదుర్గం డివిజన్‌కు 5,400 క్వింటాళ్లు, కళ్యాణదుర్గం డివిజన్‌కు 2,300 క్వింటాళ్లు, గుత్తి డివిజన్‌కు 2 వేల క్వింటాళ్లు, అనంతపురం డివిజన్‌కు 670 క్వింటాళ్లు అలాట్ చేశారు.
22 మండలాల్లో పంపిణీ..
విత్తన పప్పుశనగ పంపిణీకి 22 మండలాల్లో ఏర్పాట్లు చేశారు. అనంతపురం, ఆత్మకూరు, కూడేరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్, గుత్తి, పెద్దవడుగూరు, పామిడి, శింగనమల, యాడికి, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విపడనకల్లు, గుంతకల్లు మండల పరిధిలో విత్తన పంపిణీ చేయనున్నారు. జేజీ–11 రకం విత్తన పప్పుశనగ క్వింటా ధర రూ.9,400 కాగా అందులో 25 శాతం రాయితీ రూ.2,350 పోనూ రైతులు తమ వాటా కింద రూ.7,050 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు భూ విస్తీర్ణం బట్టి గరిష్టంగా 200 కిలోలు (10 ప్యాకెట్లు) పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎక్కడికక్కడ ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లను సంప్రదించి తమ వాటా చెల్లించి రిజస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే, కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో విత్తనంపై కేవలం 25 శాతం రాయితీ ఇవ్వడంపై కూటమి ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, ఉచిత పంటల బీమాతో లబ్ధి చేకూరుస్తూనే విత్తన పప్పుశనగపై 40 శాతం రాయితీ ఇచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఒనగూరిన ప్రయోజనాలు శూన్యమని వాపోతున్నారు.
మండలాల వారీగా విత్తన కేటాయింపులు
తాడిపత్రి డివిజన్‌కు 8,100 క్వింటాళ్లు
తక్కువ రాయితీపై మండిపడుతున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment