తప్పు సరిదిద్దుకున్న వారే ఉత్తములు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
బుక్కరాయసముద్రం: సమాజంలో తప్పు చేయని వారు ఎవరూ ఉండరని, అయితే చేసిన తప్పును సరి దిద్దుకున్న వారే ఉత్తములని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రెడ్డిపల్లి జిల్లా జైలు, ఓపన్ ఎయిర్ జైలులో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శివ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాలులు అర్పించారు. అనంతరం జిల్లా జడ్జి న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు మహాత్మా గాంధీ అన్నారు. దేశంలో శాంతిని నెలకొల్పడానికి ఆయన ఎంతో శ్రమించారన్నారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అనే గాంధీజీ సిద్ధాతాలను పాటించాలన్నారు. జైల్లో మంచి అలవాట్లు అలవర్చుకుని బయటకు వెళ్లాక ప్రశాంత జీవనం గడపాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఖైదీలకు స్వీట్లు పంపిణీ చేశారు. మహిళా ఖైదీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ రహ్మాన్, ఓపెన్ ఎయిర్ జైలు సూపరిండెంటెడ్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దేవి, నాబార్డ్ స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజర్ అనూరాధ, జైలర్లు మధుసూధన్‌రెడ్డి, అప్పల నాయుడు, నాగరాజు, మధు సూధన్‌రెడ్డి, డాక్టర్ వినోద్‌కుమార్, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment