చిరుత దాడి.. 65 గొర్రెపిల్లల మృతి
శింగనమల: చిరుత దాడిలో 65 గొర్రె పిల్లలు మృతి చెందాయి. బాధిత కాపరులు తెలిపిన మేరకు... శింగనమలకు చెందిన నాగలాపురం రాఘవ , ఎరికల నాగరాజు... గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తమ గొర్రెలను మేపునకు తోలుకెళుతూ 65 గొర్రె పిల్లలను శింగనమల కొండ దిగువన దొడ్డిలో వేసి, కంచె వేశారు. వాటి వద్ద కాపలాకున్న రాఘవ... మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వచ్చేలోపు గొర్రెపిల్లలన్నీ మృతి చెంది ఉన్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. కళేబరాలపై ఉన్న పంటి గాట్లను బట్టి చిరుత దాడిలో మృతి చెందినట్లుగా నిర్ధారించుకున్నారు. శింగనమల కొండలో ఇటీవల చిరుత సంచారాన్ని చూసినట్లుగా స్థానికులు తెలిపారు. ఘటనలో దాదాపు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరులు వాపోయారు.
ఆటో బోల్తా
గుత్తి: స్థానిక గుంతకల్లు రోడ్డులో చెరువు కట్ట వద్ద సోమవారం ఉదయం ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలోని కంపచెట్లలో బోల్తా పడింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గాయపడ్డారు. వివరాలు... నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం గ్రామానికి చెందిన 15 మంది కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం ముగించుకుని సోమవారం తిరుగు ప్రయాణమైన వారు గుత్తి శివారులోకి చేరుకోగానే చెరువు కట్ట వద్ద ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో అంజనమ్మ, ఆలుమూరు, రామాంజనేయులు, హనుమన్న, నిర్మలమ్మ, లక్ష్మి, సుప్రియా, కీర్తితో పాటు మరో నలుగురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను వెలికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు
కర్ణాటకలో ప్రమాదం...
కంబదూరు వాసి దుర్మరణం
కంబదూరు: కర్ణాటకలోని కె.రాంపురం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో కంబదూరుకు చెందిన ఎస్‌ఎండీ రఫీక్ (27) దుర్మరణం పాలయ్యాడు. వివరాలు... రఫీక్, గిరి, హసేన్ స్నేహితులు. వీరు ముగ్గురూ సోమవారం ఉదయం పావగడ నుంచి ద్విచక్ర వాహనంపై కంబదూరుకు బయలుదేరారు. కె.రాంపురం వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. రఫీక్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇసుక డంప్ సీజ్
డి హీరేహాళ్(రాయదుర్గం): డి హీరేహాళ్ మండలం కల్యం గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌ను సోమవారం ఉదయం రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ, పోలీసు అధికారులు గుర్తించి, సీజ్ చేశారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన మేరకు... బాదనహాళ్ వద్ద ఉన్న హగరి నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ట్రాక్టర్లతో ఇసుక తరలించి నిల్వ చేసినట్లుగా సమాచారం అందడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు 42 క్యూబిక్ మీటర్ల నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. అయితే ఇసుక ఎవరు తరలించారు? ఎందుకు నిల్వ చేశారు? అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
కర్ణాటక మద్యం స్వాధీనం
విడపనకల్లు: మండలంలోని డొనేకల్లులో సోమవారం ఉరవకొండ ఎకై ్సజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. దాసరి భార్గవ నుంచి 192 హైవార్‌ుడ్స, చీర్స్ విస్కీ టెట్రా ప్యాకెట్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్లు రవిచంద్ర, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment