బిడ్డ కాన్పు ఖర్చులకు డబ్బు అవసరమని..
ప్రమాదం జరిగిందిలా.. (ప్రతీకాత్మక చిత్రం)
అన్యోన్యంగా ఉండే కొండమ్మ, ఈశ్వరయ్య దంపతులను రోడ్డు ప్రమాదం కబళించింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం కాగా ఇద్దరినీ ఉన్నత చదువులు చదివించారు. కుమారుడు హర్షవర్దన్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తుండగా, కుమార్తె టీటీసీ పూర్తి చేసింది. తోటి కూలీలు పిలవడంతో ఆటో ఎక్కిన కొండమ్మ, ఈశ్వరయ్యలు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆస్పత్రిలో ముందు కొండమ్మ ప్రాణాలు విడవగా, కొద్దిసేపటికే ఈశ్వరయ్య కూడా మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్న నాగన్న, చిన్న నాగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా పెద్ద కుమార్తె శాంతి నిండు గర్భిణి. రెండో కుమార్తె స్పందన డిగ్రీ చదువుతోంది. కుమార్తె కాన్పు ఖర్చుల కోసం డబ్బు అవసరం కావడంతో దంపతులిద్దరూ కూలి పనులకెళ్లేవారు. దూరమైనా ఎక్కువ కూలి వస్తుందని భావించి శనివారం వేరే ఊరికి ఆటోలో వెళ్లారు. ఈ క్రమంలోనే జరిగిన ప్రమాదంలో నాగన్న, నాగమ్మలు ప్రాణాలు వదలడంతో బిడ్డలు గుండెలవిసేలా రోదించారు.
మృత్యువులోనూ వీడని బంధం
Comments
Please login to add a commentAdd a comment