విద్యార్థి మృతి మంత్రి లోకేష్‌కు పట్టదా?
అనంతపురం అర్బన్: అనంతపురంలోని నారాయణ కళాశాలలో విద్యార్థి మరణించి నాలుగు రోజులవుతున్నా విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు పట్టదా అని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు అని ప్రశ్నించారు. చరణ్ మృతికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థి మృతి ఘటనపై మంత్రి లోకేష్ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. మంత్రి నారాయణ కళాశాల కావడంతోనే మౌనం పాటిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాయన్నారు. మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థ కావడంతో చర్యలకు అధికారులు భయపడుతున్నారన్నారు. నారాయణను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వినోద్‌కుమార్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి నరేష్, ఏఐఎస్‌బీ జిల్లా కార్యదర్శి పృథ్వి, బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్‌యాదవ్, నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి వినోద్‌కుమార్, ఏఐడీఎస్‌ఓ నాయకులు మహేశ్, విద్యార్థి సంఘ నాయకులు చందు, వంశీ, గిరి, సాయి, సిద్ధు పాల్గొన్నారు.
● విద్యార్థి మృతిపై ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ పీడీఎస్‌యూ, ఏపీఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఏ నాయకులు కూడా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నారాయణను మంత్రి వర్గం నుంచి తొలగించడంతో పాటు బాధిత విద్యార్థి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతూ కలెక్టర్‌కు నాయకులు వీరేంద్ర, శంకర్, వేమన, ఓబుళేసు, శివ వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment