
AP Elections Political Latest Updates Telugu..
8:40 PM, Mar 15th, 2024
కృష్ణాజిల్లా:
పెనమలూరు టిక్కెట్ పై చంద్రబాబు నుంచి బోడే ప్రసాద్‌కు దక్కని హామీ
- సీటిచ్చినా ఇవ్వకపోయినా పోటీచేస్తానని ప్రకటించిన బోడే ప్రసాద్
- యనమలకుదురు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బోడే
- నేను చంద్రబాబును దేవుడిలా భావించా
- పెనమలూరులో నాకే అవకాశం కల్పించండని కోరుతున్నా
- అవకాశం కల్పించకపోతే చంద్రబాబు ఫోటోతో రోడ్డెక్కుతా
- నా కుటుంబంతో సహా వీధుల్లోనే ఉంటా
- నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తా
- పార్టీని నమ్ముకుని నేను అన్ని రకాలుగా దెబ్బతిన్నా
- నా అవసరం పార్టీకి ఏ రకంగా లేదో సమాధానం చెప్పాలి
- నేను కచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తా
- చంద్రబాబు నుంచి నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు
- పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తా
- నేను ఏ సింబల్ పై పోటీచేసినా గెలిపించాలని ప్రజలను కోరుతున్నా
7:00 PM, Mar 15th, 2024
విజయవాడ:
పలువురు అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడకుండా హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు
- ఉదయం నుండి చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేస్తున్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
- 8 గంటల నుండి ధర్నా చేస్తే రెండే నిమిషాల్లో చెప్పాలని చెప్పిన బాబు
- ఏం చెప్పినా చూద్దాం అని సమాధానం చెప్పి వెళ్లిపోయిన బాబు
- నిరాశలో బుజ్జగింపులకోసం వచ్చిన నేతలు
6:50 PM, Mar 15th, 2024
ఎన్నికల తర్వాత టీడీపీ.. బీజేపీలో విలీనం కాబోతోంది: విజయసాయిరెడ్డి
- మూడు పార్టీలు కలిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ గ్రాఫ్ మరింత పెరిగింది
- వైఎస్సార్‌సీపీ ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు
- ప్రజలందరికీ నచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతోంది
- సీఎం జగన్ మేనిఫెస్టో ఇస్తే.. తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మేనిఫోస్టో ఉంటుంది
- 175కి 175 స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం
5:45 PM, Mar 15th, 2024
చంద్రబాబుతో ముగిసిన కళా వెంకట్రావు భేటీ
- రెండో జాబితాలో కూడా కళాకు దక్కని చోటు
- ఎచ్చర్ల స్థానాన్ని ఆశిస్తున్న కళా వెంకట్రావు
5:40 PM, Mar 15th, 2024
కాకినాడ జిల్లా:
పార్టీ కోసం ఎంతో చేశాను..ఎన్నో యిబ్బందులు పడ్డాను
పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ ఇంచార్జ్ వర్మ
- చెప్పిన పనిని పార్టీ కోసం తూచ తప్పకుండా చేయడం నేరమా?
- ఇవాళ చాలా నష్టం జరిగింది.
- నేనైనా.. చంద్రబాబు అయినా ప్రజాభిప్రాయాన్ని అడ్డుకోలేం
- రేపు నన్ను రమ్మని చంద్రబాబు కబురు పెట్టారు.
- కార్యకర్తల అభిప్రాయాలు చంద్రబాబు కు వెల్లడిస్తాను.
- ఆ తరువాత వచ్చి నా అభిప్రాయం చెబుతాను
- ఎక్కడా వెనుకంజ వెనుకంజ వెయ్యను.
5:28 PM, Mar 15th, 2024
విజయవాడ:
చంద్రబాబుతో ముగిసిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ భేటీ
- చంద్రబాబును ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాను.
- చివరికి క్షణంలోనైనా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను
- న్యాయం జరగకపోతే ఏం చేయాలనేది కార్యకర్తలు నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది
- టికెట్ నాకే ఇవ్వాలని నేను అడుగుతున్నాను.నేనే పోటీ చేస్తానని చెబుతున్నాను
- చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను
- బీఫామ్ ఇస్తే పార్టీ జెండా పెట్టుకుని ముందుకు వెళ్తాను
- ఇవ్వకపోతే చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను
5:04 PM, Mar 15th, 2024
విజయవాడ:
నేరుగా చంద్రబాబుకు తగిలిన నిరసన సెగ
- హెలిప్యాడ్ వరకు చొచ్చుకు వెళ్లిన వడ్డెర సంఘం నేతలు
- చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు
- బీసీలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి బాబు అంటూ నినాదాలు
- హెలిప్యాడ్ దిగి రావాలని డిమాండ్ చేసిన వడ్డేర సంఘం నేతలు
4:50 PM, Mar 15th, 2024
అమరావతి
హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహణ
ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
- ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత
- ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటాం
- ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతాం
- పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తాం
- ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయి
- ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి
- ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది
- నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం
- ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గోనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది
- అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం
4:40 PM, Mar 15th, 2024
శ్రీ సత్యసాయి జిల్లా:
ధర్మవరంలో బెడిసి కొట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు
- ధర్మవరం సీటు బీజేపీకి కేటాయింపు పై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
- సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇంటిని ముట్టడించిన పరిటాల వర్గీయులు
- ధర్మవరం టిక్కెట్ పరిటాల శ్రీరామ్ కు ఇవ్వాలని డిమాండ్
- సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్న మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి
- ధర్మవరం టిక్కెట్ బీజేపీ నేత వరదాపురం సూరీకి ఇస్తే సహకరించేది లేదంటున్న పరిటాల శ్రీరామ్ వర్గీయులు
4:35 PM, Mar 15th, 2024
విజయవాడ:
చంద్రబాబును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి జవహర్
- కొవ్వూరు టికెట్ ఆశిస్తున్న జవహర్
- నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయింపు.
- జవహర్‌ను బుజ్జగించేందుకు పిలిచిన టీడీపీ అధిష్టానం
- టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్న జవహర్
3:50 PM, Mar 15th, 2024
విశాఖ:
విశాఖలో కాపు సేన ఆధ్వర్యంలో సమావేశం
టీడీపీ, జనసేన, బీజేపీ కాపులకు అన్యాయం చేస్తున్నారు: నారాయణమూర్తి.. కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు
- 2024 ఎన్నికలలో కాపు లకి చాలా అన్యాయం జరుగుతుంది
- అప్పట్లో విశాఖ లో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఉంటే అందులో రెండు స్థానాలు కాపులకు ఇచ్చేవారు.
- ఈ ఎన్నికల్లో కచ్చితంగా దిని ప్రతి ఫలం మీకు కనిపిస్తుంది
- ఉమ్మడి జిల్లాలో 10 లక్షల మంది కాపు లు ఉన్నారు
- ఆల్రెడీ పొత్తులో భాగంగా కాపు నాయకలని టీడీపీ తొక్కేసింది
- మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు
- 1995 నుంచి మాకు ఎవరితో సంబంధం లేదు.. కాపులతో మాత్రమే మాకు సంబంధం
- ముద్రగడ పద్మనాభం కి మా సపోర్ట్ ఉంటుంది
- కాపు ఐకాన్గా మేము ముద్రగడకి అనుకుంటాం
- విశాఖ సిటీలో నాలుగు నియోజకవర్గం లలో మేము ప్రభావితం చేస్తాం
3:30 PM, Mar 15th, 2024
విజయవాడ
ప్రదాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం
- బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని వ్యూహాత్మకంగా లీక్ చేసిన సీనియర్లు
- ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని లేఖలో పేర్కొన్న సీనియర్లు
- ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో పేర్కొన్న సీనియర్లు
- టీడీపీ నేతలని బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు
- బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపణ
- పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలన్న సీనియర్లు
- ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకి నష్టమన్న సీనియర్లు
3:25 PM, Mar 15th, 2024
విజయవాడ:
చంద్రబాబు నివాసానికి వచ్చిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు
- ఇప్పటి వరకు కాకినాడ టికెట్ ప్రకటించని బాబు
- టికెట్ తనకు ఇవ్వాలని కోరుతున్న కొండబాబు..
- కొండబాబును చంద్రబాబు నివాసం వద్ద అడ్డుకున్న రంపచోడవరం టీడీపీ కార్యకర్తలు
3:19 PM, Mar 15th, 2024
విజయవాడ:
చంద్రబాబు నివాసానికి చేరుకున్న బోడె ప్రసాద్
- సీటు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటానని చెప్పిన బోడె
- బోడెను బుజ్జగింపులకు పిలిచిన బాబు
3:15 PM, Mar 15th, 2024
విజయవాడ:
మైలవరం టిక్కెట్ కోసం పట్టువీడని బొమ్మసాని సుబ్బారావు
- ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటున్న బొమ్మసాని
- వరుస బలప్రదర్శనలతో చంద్రబాబుకు తలపోటుగా మారిన బొమ్మసాని సుబ్బారావు
- బొమ్మసానికే టిక్కెట్ ఇవ్వాలంటూ గొల్లపూడిలో బొమ్మసాని అనుకూల వర్గం ర్యాలీ
- నాన్ లోకల్ వద్దు..లోకల్ ముద్దంటూ నినాదాలు చేసిన బొమ్మసాని వర్గం
3:09 PM, Mar 15th, 2024
విజయవాడ
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశంలో అలజడి
- టీడీపీతో పొత్తులపై జాతీయ ప్రదాన కార్యదర్సి వినోద్ ధావడేని నిలదీసిన కార్యకర్తలు
- ప్రదాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్సలకి క్షమాపణలు చెప్పకుండా ఎలా పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నలు
- ప్రదానికి చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న కార్యకర్తలు
- పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా సీట్లు ఇస్తారంటూ ప్రశ్నలు
- బీజేపీకోసం పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్న కార్యకర్తలు
- బీజేపీకి కేటాయించిన సీట్లలో చంద్రబాబు పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు
- కార్యకర్తల ప్రశ్నలకి ఉక్కిరిబిక్కిరి అయిన జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే
- ప్రదాని మోదీ చిలకలూరిపేట సభని విజయవంతం చేయండి...రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలుస్తా
- అధిష్టానం దృష్టికి కార్యకర్తల మనోభాబాలని తీసుకెళ్తా అన్న వినోద్ ధావడే
2:40 PM, Mar 15th, 2024
కాకినాడ :
పిఠాపురంలో బలప్రదర్శనకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే వర్మ
- 3 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి అనుచరులు రావాలని సూచన
- పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు లేకుండా ఎమ్మెల్యే వర్మ సమావేశం
- స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి మొగ్గుచూపుతున్న ఎమ్మెల్యే వర్మ
- పిఠాపురం సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీలో మొదలైన రచ్చ
- ఇప్పటికే ఎమ్మెల్యే వర్మకు పార్టీ పెద్దల నుంచి పిలుపు
- కార్యకర్తలతో సమావేశం తర్వాత టీడీపీ పెద్దలను కలుస్తానన్న వర్మ
2:15 PM, Mar 15th, 2024
రేపటిలోపు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులు: చంద్రబాబు
- ఇవాళ, రేపటిలోగా ఎంపీ అభ్యర్థులతో పాటు పెండింగ్ స్థానాలను కూడా ప్రకటిస్తామన్న చంద్రబాబు.
- సీనియర్లకు సీట్లు లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు.
- కొంతమందిని పిలిచి మాట్లాడుతున్నాను.
- అందరిని పిలిచి మాట్లాడదామనుకున్నా సమయం సరిపోడం లేదు.
- సీట్లు దక్కని సీనియర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను.
2:00 PM, Mar 15th, 2024
చంద్రబాబు శిలా ఫలకాలకే పరిమితమయ్యారు: వైవీ సుబ్బారెడ్డి
- సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ సీఎంగా జగన్ గెలవాలి.
- ఎల్లో మీడియా టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
- పేదలకు అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారు
- ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి.
- చంద్రబాబు శిలా ఫలకాలకే పరిమితమయ్యారు.
- ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు.
- విశాఖ అభివృద్ధిలో బొత్స ఝాన్సీ కీలకపాత్ర పోషిస్తారు.
- విశాఖ అభివృద్ధి దివంగత నేత రాశేఖర్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగింది.
1: 45 PM, Mar 15th, 2024
టీడీపీలో అసమ్మతి..
కాకినాడ..
- నేడు పిఠాపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశం
- సమావేశంలో పాల్గోననున్న మాజీ ఎమ్మెల్యే వర్మ.
- పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని నిన్న ప్రకటించడంతో టీడీపీలో రేగుతున్న అసమ్మతి సెగ.
- మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమవుతున్న టీడీపీ శ్రేణులు.
1: 35 PM, Mar 15th, 2024
చంద్రబాబుకు పోతుల సునీత కౌంటర్
- నెల్లూరులో ఎమ్మెల్సీ పోతుల సునీత కామెంట్స్.
- బీసీలను చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచారు.
- గత ఎన్నికల్లో ఇచ్చిన సీట్ల కంటే తక్కువ సీట్లు ఇచ్చారు.
- చంద్రబాబు అబద్దపు హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
- టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్నీ రద్దు అవ్వుతాయి.
1: 25PM, Mar 15th, 2024
విశాఖ
వంగలపూడి అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు..
- పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనిత.
- అనిత ఎన్నికల ప్రచారానికి జనసేన నేతల దూరం.
- అనితను వ్యతిరేకిస్తున్న స్థానిక జనసేన నాయకులు.
- అనిత ప్రచారానికి మొహం చాటేసిన గెడ్డం బుజ్జి లక్ష్మిశివకుమారి, శివదత్.
- పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటును ఆశించిన జనసేన నేతలు.
1:15 PM, Mar 15th, 2024
సత్యవేడు టీడీపీలో లుకలుకలు
- చంద్రబాబు తీరును దుయ్యపట్టిన జేడీ రాజశేఖర్
- సత్యవేడులో టీడీపీ కోసం ఏంతో కష్టపడ్డాను
- నాకు కాకుండా వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చారు
- ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా సత్యవేడులో పోటీ చేస్తాను
- చంద్రబాబు, లోకేష్ ఫోటోలు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాను.
- నేను గెలిచి నా విజయాన్ని చంద్రబాబుకు అంకితమిస్తా.
- సత్యవేడులో ఆదిమూలంను చిత్తుగా ఓడిస్తాను.
12:55 PM, Mar 15th, 2024
టీడీపీపై పీతల సుజాత షాకింగ్ కామెంట్స్
- మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు
- డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా?
- పక్క రాష్ట్రాల వారికి, ఎన్‌ఆర్‌ఐలకు సీట్లు ఇస్తున్నారు
- చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు
- టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారు.
- నేను 20 ఏళ్లుగా టీడీపీలో ఉంటే సీటు ఇవ్వలేదు
- పశ్చిమగోదావరిలో ఒక్క మాల వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం అన్యాయం
- మా కుటుంబం 1982 నుండి టీడీపీలోనే ఉంది
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పనిచేస్తే సీట్లేమో ఎన్‌ఆర్‌ఐలకు ఇస్తున్నారు
- నాతో పాటు మాజీమంత్రి జవహర్‌కి కూడా టికెట్ ఇవ్వలేదు.
- సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం అన్యాయం
- నన్ను 2015 నుండి పెత్తందార్లు అవమానిస్తున్నారు.
12:45 PM, Mar 15th, 2024
టీడీపీని వీడనున్న గంటా..!
- మరోసారి పార్టీ మారే ఆలోచనలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్
- భీమిలి టికెట్ నిరాకరించడంతో టీడీపీకి రాజీనామా చేసే యోచనలో గంటా!
- నిన్న తన అనుచరులతో సమావేశం నిర్వహించిన గంటా..
- పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
- చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే చెయ్యాలి లేదంటే వేరే దారి చూసుకోవాలని సూచించిన చంద్రబాబు.
- ఎన్నికలు వచ్చినప్పుడల్లా పార్టీలు మారడం గంటాకు అలవాటే.
12:30 PM, Mar 15th, 2024
చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..
- చంద్రబాబు ఇంటిపైకి దూసుకువెళ్లిన టీడీపీ శ్రేణులు.
- వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వాలని ఆందోళన.
- శిరీషా వద్దంటూ నినాదాలు.
- చంద్రబాబుకి తలనొప్పిగా మారిన నేతల అసంతృప్తి
12:10 PM, Mar 15th, 2024
అనకాపల్లిలో జనసేనకు షాక్
- జనసేన పార్టీకి రాజీనామా చేసిన పర్చూరి భాస్కర్ రావు
- అనకాపల్లి సీటు కొణతాలకు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి
- తన అనుచరులతో సమావేశమై నిర్ణయం ప్రకటించిన పరుచూరి భాస్కరరావు
- అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశాను: పరుచూరి భాస్కరరావు
- నాకు ఏటువంటి సమాచారం లేకుండా అనకాపల్లి అసెంబ్లీ సీట్లు మార్చారు: పర్చూరి భాస్కరరావు
11:56 AM, Mar 15th, 2024
చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
- ఏపీపీఎస్సీ బోర్డుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
- సవాంగ్, పీఎస్‌ఆర్ ఆంజనేయులే ప్రధాన దోషులంటూ ఆరోపణ
- వాళ్ల నుంచి ఐపీఎస్ హోదా వెనక్కి తీసుకోవాలంటూ వ్యాఖ్యలు
11:45 AM, Mar 15th, 2024
రంపచోడవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- రంపచోడవరం టీడీపీ టికెట్ మిర్యాల శిరీషకు ఇచ్చిన అధిష్టానం
- వంతల రాజేశ్వరికి ఇవ్వకపోవడంపై అసమ్మతి సెగ
- రంపచోడవరం నుండి ఉండవల్లి చంద్రబాబు నివాసానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
- ముఖ్యనేతలు, 3000 వేల మంది కార్యకర్తలతో బాబు ఇంటికి రాజేశ్వరి
- టికెట్ వంతలకు ఇవ్వాలని.. శిరీషకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న టీడీపీ కార్యకర్తలు
- లేకుంటే.. చంద్రబాబు ముందే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటున్న టీడీపీ శ్రేణులు
11:14 AM, Mar 15th, 2024
విజయవాడ పశ్చిమలో జనసేనకు బిగ్ షాక్
- పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్లు తేల్చి చెప్పేసిన పవన్
- జనసేనకే వెస్ట్ టిక్కెట్ వస్తుందని ఆశించిన జనసేన నాయకులు
- ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్న జనసేన వెస్ట్ ఇంఛార్జి పోతిన మహేష్
- పోతినకు టిక్కెట్ ఇవ్వలేకపోతున్నట్లు ప్రకటించి హైదరాబాద్ వెళ్లిపోయిన పవన్
- పవన్ ప్రకటనతో ఖంగుతిన్న పోతిన మహేష్
- పవన్ తీరు పై మండిపడుతున్న పోతిన మహేష్,వెస్ట్ జనసేన శ్రేణులు
- పవన్ నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం
- అన్ని డివిజన్ల ఇంఛార్జిలు,కార్యకర్తలతో సమావేశమైన పోతిన మహేష్
- పోతినకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళన
- ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో పోతిన
10:50 AM, Mar 15th, 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
- వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం
- గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ.. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ చేసిన ముద్రగడ
- తనయుడు గిరితో కలిసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిసిన ముద్రగడ
- ఇద్దరికీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
- కాపు ఉద్యమనేత చేరికతో మరింత జోష్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి
— YSR Congress Party (@YSRCParty) March 15, 2024
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి… pic.twitter.com/8HrShBHGR0
10:20 AM, Mar 15th, 2024
కూటమిలో తిరుపతి సీటు పంచాయితీ
- నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దంటూ ఆందోళనలు
- అరణి శ్రీనివాసులు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసనలు
- తిరుపతి సీటు రగడపై ఇరు పార్టీల పెద్దల ఫోకస్
- పార్టీ పెద్దల సూచనతో ఆత్మగౌరవ సభ వాయిదా
- సభను వాయిదా వేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు
10:16 AM, Mar 15th, 2024
ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం
- ఎంపీ సీటు పై బీజేపీలో రగులుతున్న అసంతృప్తి
- టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి
- చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయం
- ఏలూరు పార్లమెంట్లో గత పదేళ్లుగా బీజేపీని బలోపేతం చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి
- నేడు పార్టీలకతీతంగా ఆత్మీయ సమావేశం కు పిలుపునిచ్చిన గారపాటి చౌదరి
- ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్ గా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్
- నేడు ఏలూరులో ఆత్మీయ సమావేశం లో కీలక ప్రకటన చేయనున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి
10:12 AM, Mar 15th, 2024
పిఠాపురంపై స్పెషల్ ఫోకస్
- పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ
- ప్రకటన వెలువడగానే.. పిఠాపురం టీడీపీలో భగ్గుమన్న మంటలు
- వర్మను కాదని నాన్ లోకల్ పవన్‌కు ఎలా ఇస్తారని టీడీపీ శ్రేణుల రచ్చ
- పవన్‌కు చుక్కలు చూపిస్తామంటున్న స్థానిక నేతలు
- చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టి.. పవన్‌ను ఓడిస్తామని తీర్మానం
- భీమవరం, గాజువాకలో ఓడించినట్లే పవన్‌ను పిఠాపురంలోనూ మరోసారి ఓడిస్తామంటున్న వైఎస్సార్‌సీపీ
- ఎంపీ మిథున్‌రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఎన్నికల ప్రచారం
- ముద్రగడ చేరిక కూడా వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చే అంశం
10:03 AM, Mar 15th, 2024
రేపే వైఎస్సార్‌సీపీ తుది జాబితా
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా సిద్ధం
- రేపు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- వైఎస్సార్ ఘాట్ వేదికగా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులు జాబితా ప్రకటన
- 2019లోనూ ఇలాగే ఇడుపులపాయ నుంచే ప్రకటించిన సీఎం జగన్
- ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల నియామకం(మార్పులు.. చేర్పులు)
- ఇంఛార్జిలనే అభ్యర్థులుగా దాదాపుగా ప్రకటించిన సీఎం జగన్
- రేపటి తుది జాబితాపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
- స్థానిక పరిస్థితులు.. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా.. అభ్యర్థుల్ని ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీ
09:22 AM, Mar 15th, 2024
టీడీపీని వీడే యోచనలో కేఎస్ జవహార్
- టీడీపీ అధిష్టానంపై మాజీ మంత్రి కేఎస్ జవహార్ ఆగ్రహం
- టికెట్ దక్కకపోవడంతో పార్టీ వీడే యోచన
- అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించని వైనం
- జవహర్‌ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నం
- ఇవాళ కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ
- ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన
8:50 AM, Mar 15th, 2024
వైఎస్సార్‌సీపీలో జాయినింగ్స్ జోష్
- కాసేపట్లో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చేరిక
- సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ
- ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల జాయినింగ్
- పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు, చేగొండి సూర్యప్రకాష్, పులివెందుల సతీష్ రెడ్డి తదితర ముఖ్యనేతలు
- ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పెద్ద పెద్ద నేతలు చేజారిపోతుండటంతో టీడీపీ, జనసేనల్లో ఆందోళన
8:30 AM, Mar 15th, 2024
కొల్లు రవీంద్ర ఓవరాక్షన్..
- పేదలకు మంచి జరగడం తట్టుకోలేకపోతున్న టీడీపీ నేతలు
- మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఓవరాక్షన్
- తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి ఉద్యోగుల విధులను అడ్డుకున్న కొల్లు రవీంద్ర , అతని అనుచరులు
- ప్రభుత్వం చొరవతో మచిలీపట్నం పరిధిలోని 18,119 నివేశస్థలాలకు సంబంధించి కన్వేయన్స్ డీడ్‌లు పంపిణీ చేపట్టిన అధికారులు
- పంపిణీ చేయాల్సిన వాటిలో మిగిలిపోయిన 2,829 కన్వేయన్స్ డీడ్‌లను కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తున్న అధికారులు
- కన్వేయన్స్ డీడ్‌లను సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తున్న సిబ్బంది
- 30 మంది అనుచరులతో వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసిన కొల్లు రవీంద్ర అండ్ గ్యాంగ్
- దొంగపట్టాలు తయారు చేస్తున్నారంటూ నానా హడావిడి చేసిన కొల్లు రవీంద్ర
- దొంగపట్టాలు తయారు చేస్తున్నట్లు ఒప్పుకోవాలంటూ ఫొటోలు, వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డ కొల్లు రవీంద్ర
- కలెక్టర్‌కు ఫోన్ చేయడంతో పాటు తహశీల్దార్ కార్యాలయంలో ఆందోళనకు దిగిన కొల్లు రవీంద్ర
- టీడీపీ నేతల ఫిర్యాదుతో ఘటనపై తక్షణ ఎంక్వైరీకి ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
- కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి కన్వేయన్స్ డీడీలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ
- తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి దొంగ పట్టాలు తయారు చేయడంలేదని కలెక్టర్‌కు రిపోర్ట్ ఇచ్చిన జేసీ గీతాంజలి శర్మ
8:00 AM, Mar 15th, 2024
రెండు స్థానాలపై కొనసాగుతున్న సస్పెన్స్..
- మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ.
- సెకండ్ లిస్టులో ఈ రెండు నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టిన అధిష్టానం.
- పెనమలూరు ఇన్‌ఛార్జ్ బోడె ప్రసాద్‌కు టికెట్ ఇవ్వలేమని చెప్పిన టీడీపీ అధిష్టానం.
- టీడీపీలోనే ఉంటాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న బోడె ప్రసాద్.
- మైలవరంలో కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన.
- ఇద్దరిలో ఒకరికి మైలవరం, మరొకరికి పెనమలూరు టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం.
7:40 AM, Mar 15th, 2024
విజయవాడ..
ఏపీ బీజేపీలో ముదురుతున్న టిక్కెట్ల పంచాయితీ
- బీజేపీలో కలకలం రేపుతున్న సీనియర్ల లేఖ
- చంద్రబాబు తీరు, ఏపీ రాజకీయ పరిణామాలపై ఢిల్లీకి ఫిర్యాదులు
- పొత్తులపై గళం విప్పుతున్న ఏపీ బీజేపీ నేతలు
- బీజేపీ అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారని బీజేపీ సీనియర్లు ఫైర్
- బీజేపీకి గెలవని సీట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడుతున్న సీనియర్ నేతలు
- బీజేపీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసిన రాష్ట్ర సీనియర్ నేతలు
- టీడీపీ గెలవని సీట్లు బీజేపీకి కేటాయించిందంటూ మండిపాటు
- అధిష్టానానికి లేఖ రాసిన 16 మంది బీజేపీ సీనియర్లు
- టీడీపీ తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ ఇన్‌ఛార్జ్ మధుకర్‌జీని కలిసిన సీనియర్లు
- రెండు దశాబ్దాలుగా టీడీపీ గెలవని బద్వేలు, జమ్మలమడుగు, అనపర్తి, విజయవాడ వెస్ట్, ఆధోని వంటి సీట్లు కేటాయించడంపై ఫిర్యాదు
- సీఎం సొంత జిల్లా వైఎస్సార్ కడపలో రెండు సీట్లు కేటాయింపుపై అసంతృప్తి
- బద్వేలు లాంటి అసెంబ్లీలో కనీసం పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరని ఆగ్రహం
- బీజేపీ సీట్లని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని మండిపడుతున్న సీనియర్లు
- టిక్కెట్ల కేటాయింపులో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్
7:20 AM, Mar 15th, 2024
పురందేశ్వరిపై ఫిర్యాదు..
విశాఖ..
- పురందేశ్వరి తీరుపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు.
- పురందేశ్వరి తీరుతో పార్టీ నష్టపోతుందని లేఖలో ప్రస్తావన.
- తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బలి చేస్తున్నారని ఆరోపణ.
- పొత్తులో భాగంగా అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే స్థానాలు తీసుకోవడంపై నేతల ఫిర్యాదు.
- అరకు, పాడేరు స్థానాలపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి.
- అరకు ఎంపీ సీటుకు బదులు విశాఖ ఎంపీ స్థానం తీసుకోవాలని సూచన.
- పాడేరు సీటుకు బదులు చోడవరం లేదా మాడుగుల కేటాయించాలని ప్రస్తావన.
7:10 AM, Mar 15th, 2024
నేడు వైఎస్సార్‌సీపీలో ముద్రగడ చేరిక
- కాపు నేత ముద్రగడ పద్మనాభం నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక
- తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ
- ముద్రగడ కుమారుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరిక.
7:00 AM, Mar 15th, 2024
ఏపీలో మళ్లీ ఫ్యాన్‌దే హవా
అసెంబ్లీ సీట్ల సర్వే ఫలితాలు
వైఎస్సార్‌సీపీ:121+/-5
టీడీపీ-జనసేన-బీజేపీ: 54+/-5
కాంగ్రెస్: 00
ఇతరులు: 00
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం అంచనా
వైఎస్సార్‌సీపీ: 49.5 శాతం
టీడీపీ-జనసేన-బీజేపీ: 43 శాతం
కాంగ్రెస్: 2.5 శాతం
ఇతరులు: 5 శాతం
YSRCP Poised to be elected again in Andhra Pradesh, Even Against Alliance of TDP, JSP, and BJP
— Political Critic (@PCSurveysIndia) March 14, 2024
According to our survey findings, the YSRCP in Andhra Pradesh stands in a strong position to secure another term in the 2024 elections. Despite potential alliances forming against it,… pic.twitter.com/PCdwZx6w6B
6:55 AM, Mar 15th, 2024
భగ్గుమన్న పొత్తు బంధం..
- టీడీపీ రెండో జాబితా ప్రకటన వెలువడగానే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం
- జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుపై సర్వత్రా ఆగ్రహావేశాలు
- భగ్గుమన్న విభేదాలు...రోడ్డుకెక్కిన అసమ్మతి
- పోటాపోటీగా టీడీపీ, జనసేన నాయకుల నిరసన జ్వాలలు
- పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతానన్న పదినిమిషాలకే రచ్చరచ్చ
- టీడీపీకి గండి బాబ్జీ రాజీనామా..!
- భాష్యం ప్రవీణ్‌కు సీటు కేటాయించడంతో నిరాశలో కొమ్మాలపాటి..
- బోడె ప్రసాద్‌కు సీటు లేదని తేల్చిచెప్పిన అధిష్టానం
- మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్న బోడె మద్దతుదారులు
- రంపచోడవరంలో శిరీషకు టికెట్ ఇవ్వడంపై నిరసన సెగలు.. కోసిగిలో నిరసన తెలిపిన తిక్కారెడ్డి అనుచరులు..
- తిరుపతిలో ఆరణికి వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలు
- కొవ్వూరులో ‘ముప్పిడి’ ఫ్లెక్సీలు చించేసిన ‘జవహర్’ వర్గీయులు
6:50 AM, Mar 15th, 2024
‘పొత్తు’కు పోతే ‘కత్తెర’ పడింది
- పొత్తులో మధ్యవర్తిత్వం చేసి నష్టపోయాం
- పెద్ద మనసుతో వెళ్లి మనల్ని మనమే చిన్న చేసుకున్నాం
- రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ జనసేన కాకపోతే ఇంకెవరు?
- నాతో పని చేసేవాళ్లు..కాఫీ ఇచ్చి ఎమ్మెల్యే అయిపోదామని ఆశపడ్డ వాళ్లు
- సంక్షేమం ఎక్కువైతే శ్రీలంక పరిస్థితే.. సోషల్ మీడియా వల్ల అవతలివారు చనిపోయే పరిస్థితి రాకూడదు
- జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్
6:40 AM, Mar 15th, 2024
విశాఖ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్న టీడీపీ - బీజేపీ
- సీటు తనదేనని ధీమాగా ఉన్న బీజేపీ ఎంపీ జీవీఎల్
- టీడీపీ నుంచి భరత్‌కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్న బాబు, పురంధేశ్వరి
- టీమ్ జీవీఎల్ అధ్వర్యంలో విశాఖ లో బైక్ ర్యాలీ
- ఢిల్లీ నుంచి వచ్చిన జీవీఎల్‌కు ఘన స్వాగతం పలికి ర్యాలీగా తీసుకెళ్లిన పార్టీ శ్రేణులు
- విశాఖ లోక్ సభ కోసం ప్రయత్నిస్తున్న జీవీఎల్ తాజా ర్యాలీ పై ఆసక్తికర చర్చ
6:30 AM, Mar 15th, 2024
టీడీపీకి రాజీనామాకు రెడీగా ఉన్నాం: ప్రగడ నాగేశ్వరరావు
- అనకాపల్లి ఎలమంచిలి..
- టీడీపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
- ఎలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
- పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు.
- చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
- అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరఫున ఒక్క సీటు కాపులకు ఇవ్వకపోవడం దారుణం.
- కాపులు అవసరం మీకు లేదా?.
- చంద్రబాబు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
- టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment