సాక్షి, అమరావతి: ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. టీచర్లకు వ్యాక్సిన్ పూర్తయ్యాకే పరీక్షలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. టెన్త్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. లిఖిత పూర్వకంగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 18కి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జులైలో మరోసారి సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
చదవండి: పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
అర్చకులపై ఏపీ సర్కార్ వరాల జల్లు..
Comments
Please login to add a commentAdd a comment