రాజంపేట: లోక్‌సభ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో వందపడకల ఆసుపత్రి ఏర్పాటుతో పేదరోగుల కల నెరవేరింది. రూ.23కోట్ల వ్యయంతో ఆధునికవైద్యం అందించేలా భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం పెద్దాసుపత్రి ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీచైర్మన్ ఆకేపాటి అమరనాఽథరెడ్డి సంయుక్తంగా ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విలేక రులతో మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో వందపడకల ఆసుపత్రి అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్పొరేట్ వైద్యం అందించే విధంగా వివిధ రకాల ప్రత్యేక చికిత్స విభాగాలను ఇక్కడ ఏర్పాటుచేశారన్నారు. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా అన్ని చర్యలను సెకండరీ హెల్త్ అధికారులు తీసుకున్నారన్నారు. గతంలో పెద్దాసుపత్రి దయనీయపరిస్ధితులో ఉండేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో దీని రూపురేఖలు మారిపోయాయన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఖరీదైన వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనే అందించేలా తీసుకున్న చర్యల ఫలితంగా ఈ రోజున రాజంపేటలో కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో ప్రాంతీయ వైద్యశాలను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. పేదల పక్షాన నిలబడిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, రానున్న ఎన్నికల్లో ఆయనకు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మున్సిపాలిటి చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైస్‌చైర్మన్ మర్రి రవి, డీసీహెచ్‌లు డేవిడ్, హిమదేవి, డీఎంహెచ్‌వో కొండయ్య,ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ జయచంద్రారెడ్డి, డీఈ రాజగోపాల్, సూపరింటెండెంట్ డా.పీవీఎన్‌రాజు, హెచ్‌డీసీ సభ్యులు ఉమామహేశ్వరరెడ్డి, ఎరుకాల్వ శ్రీనివాసులు, జాకీర్‌హుసేన్, కౌన్సిలర్లు కూండ్ల రమణారెడ్డి, పసుపులేటి సుధాకర్, పట్టణజెసీఎస్ కన్వీనరు వడ్డెరమణ,రోడ్‌డెవలప్‌మెంట్ స్టేట్‌డైరక్టరు గుల్జార్‌బాష, శరణం కన్‌స్ట్రక్షన్‌కు చెందిన కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● రాజంపేట ప్రాంతీయవైద్యశాల కొత్త శోభను సంతరించుకున్న నేపథ్యంలో జెడ్పీచైర్మన్ ఆకేపాటి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిలు శనివారం నూతనంగా నిర్మించిన భవనాల్లో కలియతిరిగారు. రోగులకు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మేడా, జెడ్పీచైర్మన్ ఆకేపాటి
రాజంపేటలో వందపడకల ఆసుపత్రి ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment