ఉరుసుకు పకడ్బందీ ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్: కడప పెద్దదర్గా (అమీన్ పీర్) ఉరుసు మహోత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి హర్షవర్ధన్ దర్గా ఉత్సవ కమిటీ సభ్యులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఉరుసు నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూతోపాటు సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఊరుసు మహోత్సవాల్లో భాగంగా 16, 17వ తేదీల్లో జరిగే గంధం, ఉరుసు ఉత్సవ ఘట్టాలకు లక్షలాది మంది భక్తులు, వీఐపీలు హాజరవుతారన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఉరుసు మహోత్సవాన్ని జరిపించడంలో పోలీసు శాఖ అన్ని రకాల భద్రత చర్యలను చేపట్టిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాపింగ్ చేసి సిబ్బందికి డ్యూటీలు కేటాయించినట్లు వెల్లడించారు. ఉరుసు సందర్బంగా ముఖ్యమైన ఐదు రోజులపాటు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, దర్గా వరకు నగరంలోని అన్ని రూట్లను కవర్ చేస్తూ నిరంతరాయంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా దర్గా, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ దీపాలంకరణలో ఎక్కడా కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా నిరంతర పర్యవేక్షణ జరగాలన్నారు. వీఐపీలు, ప్రొటోకాల్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. కడప నగరంలో జరిగే అతిపెద్ద మహోత్సవాన్ని ప్రపంచం వీక్షించేలా.. సమాచార పౌర సంబంధాల శాఖ, మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలన్నారు.
రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ
ముఖ్య కార్యదర్శి హర్షవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment