రైల్వే కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం
రాజంపేట: భారతీయ రైల్వేలో కార్మికుల హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్పులు చేసుకుంటూ ముందుకు పోతోందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్‌రావు విమర్శించారు. జిల్లాలోని రాజంపేట, నందలూరు, రైల్వేకోడూరుతో పాటు పలు రైల్వేస్టేషన్‌లో గుర్తింపు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు జాతీయ స్థాయిలో ఒకే యూనియన్ ఉండి పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆ శక్తిని కార్మికులు ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్, సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్‌కు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజన్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, డివిజనల్ అధ్యక్షుడు సుదర్శన్, నందలూరు బ్రాంచి చైర్మన్ గోపీనాథ్, సెక్రటరీ విశ్వనాథ్, అసిస్టెంట్ సెక్రటరీ ఎస్‌ఎం బాషా, మాజీ సెక్రటరీ కమలాకర్, నాయకులు సుధీర్, సిద్దయ్య, శివకుమార్‌రాజు, నిచయ్‌కుమార్ సిన్హా, మణి, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.
● దక్షిణ మ ధ్యరైల్వే మజ్దూర్ యూనియన్ నేత శంకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment