అక్రమాల ఆధార్ సెంటర్‌లో తనిఖీ
రాజంపేట: రాజంపేట పట్టణంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమీపంలో ఉన్న అక్రమాల ఆధార్ సెంటర్‌లో పోలీసులు, రెవిన్యూ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. గత శనివారం సాక్షిలో ‘అక్రమాల ఆధార్ కేంద్రం గుట్టురట్టు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. రెవిన్యూ, పోలీసు అధికారులు వారం రోజులుగా మూతపడిన ఆ కేంద్రం తాళాలు పగులగొట్టి తెరిచారు. పంచనామా నిర్వహించారు. తహసీల్దారు మున్నీ, ఆర్‌ఐ శేషంరాజు, ఎస్‌ఐ నాగేశ్వరరావు, వీఆర్వో రాజు, టౌన్ ఏఎస్‌ఐ వర్మ తదితరులు ఆధార్ కేంద్రంలో పరిశీలించారు. దొడ్డిదారిలో ఆధార్ కార్డులు సృష్టించేందుకు కారణమైన ఆధారాల గురించి, సెంటర్ నిర్వహణ తీరును క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కాగా చాలా మంది వద్ద నిర్వాహకుడు ఆధార్ సర్టిఫికెట్ కోసం వేలాది రూపాయిలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న ఆధార్ సెంటర్ నిర్వాహకుడిపై రెవిన్యూ, పోలీసుశాఖ ఏటువంటి చర్య తీసుకుంటుందో వేచిచూడాలి.
ముగ్గురు ఎమ్మెల్యేలకు
విప్‌లుగా అవకాశం
కడప రూరల్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లుగా అవకాశం లభించింది. అసెంబ్లీలో మొత్తం 15 మంది విప్‌లకు గాను ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ నుంచి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జనసేన నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లకు అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లుగా అవకాశం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment