కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలం
కలికిరి/కలకడ : కూటమి ప్రభుత్వం ఐదు నెలల వ్యవధిలోనే అన్ని విధాలా విఫలమైందని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కలకడ, కలికిరి, వాల్మీకిపురం మండలాల్లో పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన ఆదివారం స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుసుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో గద్దెనెక్కిన ప్రభుత్వం వాటిని విస్మరించి అన్ని వర్గాల నుంచి వ్యకిరేకత మూటకట్టుకుందన్నారు. హామీలపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. రోజుకో అసత్య ప్రచారంతో కాలం వెల్లదీస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నియోజకవర్గంలో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment