అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయులకు నష్టం
రాయచోటి అర్బన్ : విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయులకు నష్టం కలుగుతోందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరి ప్రసాద్, జాబీర్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం జరిగిన యూటీఎఫ్ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉన్నతాధికారుల నిర్ణయాలు హెచ్‌ఎం, ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. నాన్ రెసిడెన్షియల్ పద్దతిలో శిక్షణ తరగతులు ఉంటాయని కొద్ది రోజుల కిందట ప్రకటించి, తిరిగి రెసిడెన్షియల్ పద్దతిలో నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేయడం దారుణమన్నారు. ఇటీవల శిబిరంలో ఒక హెచ్‌ఎం మృతి చెందినప్పటికీ అధికారులతీరులో మార్పురాకపోవడం తగదన్నారు. రెండు నెలల కిందట ఉపాధ్యాయుల పనిసర్దుబాటు ప్రక్రియను గందరగోళంగా పూర్తిచేసి, నేడు మళ్లీ రెండో విడతగా పనిసర్దుబాటు చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు వింత నిర్ణయాల అమలుక స్వస్తి పలకాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, సి.వి.రమణమూర్తి, దావుద్దీన్, సురేంద్రరెడ్డి, ప్రసాద్, చంద్రశేఖర్, రమేష్, హాఫీజుల్లా, వెంకటరమణ, శామ్యూల్, కిఫాయత్‌తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment