బోటింగ్ వేళ.. భద్రత డొల్ల
జమ్మలమడుగు : పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. వారి భద్రతను గాలికి వదిలేయడంతో..ఏ మాత్రం ఆజాగ్రత్తగా నడిచినా.. ప్రాణాలు గాలిలో కలిసి పోయే పరిస్థితి కలుగుతోంది. చారిత్రాత్మకమైన గండికోట విశిష్టత తిలకించేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సమీపంలోనే మైలవరం జలాశయంలో బోటింగ్ సౌకర్యం ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. మైలవరం జలాశయం నిండా నీరు చేరడంతో సందర్శకులు వీక్షించేదుకు తరలివస్తున్నారు. అయితే కరకట్టల వద్ద ప్రహరీ లేకపోవడంతో ఏం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు.
ప్రహరీ కూలినా.. పట్టక..
మైలవరం జలాశయం వీక్షణకు వచ్చిన పర్యాటకుల భద్రతతో డొల్లతనం కనిపిస్తోంది. తాజాగా కురిసిన వర్షాలకు జలాశయంలో 6.3 టీఎంసీల నీరు చేరింది. దీనికి చూసేందుకు వచ్చే జలాశయం కరకట్ట రోడ్డుకు ఇరువైపులా ప్రహరీ పూర్తిగా దెబ్బతింది. వాహనాల్లో వచ్చే పర్యాటకులు ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా, ఎదురుగా వాహనాలు వచ్చినా జలాశయంలో పడి ప్రాణాలు కోల్సోవాల్ని పరిస్థితి. జలాశయం గేట్ల వద్ద కూడా రక్షణ గొడ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతోంది. ఇటీవల దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ, తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవటానికి గేట్ల వద్దకు రాగా స్థానికులు గుర్తించి కాపాడారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని జలాశయం వద్ద పర్యాటకులకు భద్రత ఉండేలా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
మైలవరం జలాశయంలో 6.3 టీఎంసీల నీరు
కరకట్ట, గేట్ల వద్ద ప్రహరీ లేక పొంచి ఉన్న ప్రమాదం
పర్యాటకుల భధ్రత పట్టని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment