ఉన్నంతలో తృప్తిపడేవారే నిజమైన ఐశ్వర్యవంతులు
కురబలకోట : దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు ఆనందాన్ని ఉంటారని, ఉన్నంతలో తృప్తి పడేవారే నిజమైన ఐశ్వర్యవంతులని అంతర్జాతీయ సువార్త పరిచారకులు స్టీఫెన్ చిన్నప్ప పేర్కొన్నారు. మండలంలోని అంగళ్లు సీయోను ప్రార్థనా మందిరంలో జరిగిన ఆరాధన, బల్ల వర్తమానం కార్యక్రమంలో ఆయన వాక్యోపదేశం చేశారు. క్రైస్తవులు శాంతియుత జీవనం అవలంభించాలని, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ధ్యానించడంతోపాటు అనుసరించాలన్నారు. ప్రతీకారం మనిషిని బంధిస్తే క్షమాపణ విడుదల ఇస్తుందన్నారు. దేవుని కన్నా మరీ ఎక్కువుగా దేనిని ప్రేమించినా.. అది పాపంగానే పరిగణించవచ్చన్నారు. పరోపకారం మరువరాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పాస్టర్ విక్టర్ వేదనాయక్, నాతానురెడ్డి, శామ్యుయేల్, జయరాజ్రెడ్డి, భాస్కర్, తియోతి, నెహెమ్యా, జాన్, డోర్కా తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ పరిచారకులు స్టీఫెన్ చిన్నప్ప
Comments
Please login to add a commentAdd a comment