తండ్రీ, కొడుకులపై దాడి | - | Sakshi
Sakshi News home page

తండ్రీ, కొడుకులపై దాడి

Published Mon, Nov 18 2024 3:09 AM | Last Updated on Mon, Nov 18 2024 3:09 AM

తండ్ర

తండ్రీ, కొడుకులపై దాడి

బి.కొత్తకోట : తమ పొలాన్ని ఆక్రమిస్తుండగా అడ్డుకున్న రైతులపై దాడి చేసిన ఘటన ఆదివారం మండలంలోని కాండ్లమడుగు వద్ద జరిగింది. బాధితుల కథనం మేరకు.. కాండ్లమడుగుకు చెందిన రామచంద్రకు భూమి ఉంది. తమకు చెందిన భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించే ప్రయత్నం చేయగా రామచంద్ర, అతడి కుమారులు భాస్కర్‌, వేణు, ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆక్రమణకు ప్రయత్నించిన వారి వర్గీయులు వారిపై దాడి చేశారు. రామచంద్ర, భాస్కర్‌, వేణులు గాయాలవడంతో చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

108 వాహనంలో ప్రసవం

సిద్దవటం : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 అంబులెన్స్‌లోనే ఈఎంటీ వరలక్ష్మి, ఆశా వర్కర్‌ హిమాంబీ ప్రసవం చేసి తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడారు. మండలంలోని మహబూబ్‌నగర్‌ గ్రామానికి చెందిన షేక్‌ రజియాబేగం ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు 108 వాహనానికి ఫోన్‌ చేశారు. ఆశా వర్కర్‌ హిమాంబీతో కలిసి సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యంలోని పెన్నానది వంతెన సమీపంలో రజియాబేగానికి నొప్పులు ఎక్కువయ్యాయి. 108 వాహనం నిలిపి ఈఎంటీ వరలక్ష్మి, ఆశా వర్కర్‌ హిమాంబీ అంబులెన్స్‌లోనే డెలివరీ చేశారు. రజియాబేగంకు ఇది ఆరోకాన్పు కాగా మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డలు సిద్దవటం ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారని వారు తెలిపారు.

పాఠశాలల సమయం మార్చవద్దు

కడప ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలల సమయం మార్చాలనే నిర్ణయం సరికాదని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏసీవీ.గురువారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బడికి రావడం పిల్లలకు అలవాటుగా మారిందన్నారు. ఇపుడు సాయంత్రం ఐదు గంటల వరకు మారిస్తే ఇబ్బంది పడతారన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఐదు నుంచి 8 కిలోమీటర్ల దూరం నుంచి పాఠశాలకు వస్తున్నారని, వారు ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారన్నారు.

యువకుడిపై దాడి

కడప అర్బన్‌ : నగరంలోని చిలకలబావి వద్ద జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. నగరానికి చెందిన అతహర్‌తో స్థానికుడు రియాజ్‌కు మనస్పర్థలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చిలకలబావి వద్ద అతహర్‌పై రియాజ్‌, తదితరులు దాడిచేసి గాయపరిచారు. బాధితుడిని రిమ్స్‌కు తరలించారు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
తండ్రీ, కొడుకులపై దాడి1
1/1

తండ్రీ, కొడుకులపై దాడి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement