ఎలా బతకాలి..?
భవిష్యత్ అంధకారంగా మారింది
గత ప్రభుత్వంలో విజయవాడలో ఏపీఎండీసీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడిని. అయితే వచ్చిన కొత్త ప్రభుత్వం ఎటువంటి నోటీసులు, కారణాలు లేకుండా నాతో పాటు చాలా మందికి మీ ఉద్యోగాలు తీసి వేశాం అనడంతో మా భవిష్యత్ అంధకారంగా తయారయింది. ప్రభుత్వం మమ్మలను విధులలోకి తీసుకోవాలని కోరుతున్నాం.
– నరసింహులు, రెడ్డిపల్లి, పుల్లంపేట మండలం
ఉన్నఫళంగా ఉద్యోగం పోతే ఎలా..
ఐదు సంవత్సరాలుగా ఏపీఎండీసీలో అటెండర్‌గా చిమకుర్తి మైనింగ్‌లో విధులు నిర్వహిస్తున్నా. నన్ను కొత్త ప్రభుత్వం ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తీసివేస్తే నేను, నా కుటుంబం ఎలా బతకాలి. ఉద్యోగాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నా. నా పిల్లల చదువులు ఏమవుతాయో అన్న భయం పట్టుకొంది. ప్రభుత్వం పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని మా ఉద్యోగాన్ని కొనసాగించాలి. –గగ్గుటూరి బాబాఫక్రుధ్దీన్, మంగంపేట, ఓబులవారిపల్లి
ఈ ఆవేదన వీరిద్దరిదే కాదు. ఏపీఎండీసీలో పనిచేస్తూ కొత్త ప్రభుత్వం వచ్చాక ఉద్యాసనకు గురైన చిరుద్యోగులందరిది.
Comments
Please login to add a commentAdd a comment