అధికార పార్టీ సేవ కోసం పడిగాపులు
పై ఫొటోలో నేలపై కూర్చున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నారు అనుకుంటే పొరబాటే. కాదు... ఏదైనా సాయం కోసం వచ్చారనుకుంటే పప్పులో కాలేసినటేఉట.. కేవలం టీడీపీ సీనియర్ వృద్ధనేత ఒకరు తన సొంత స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పారిశుద్ధ్య కార్మికులను అక్కడికి తరలించారు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్న రీతిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను టీడీపీ నేతకు ధారాదత్తం చేశారు. ఉదయం 5గంటలకు మస్టర్ వేసుకొని పట్టణంలో చెత్తచెదారాలను ఎత్తివేసే కార్యక్రమం నిత్యం జరుగుతుంటుంది. ఆ పనికి వెళ్లనవసరంలేదు. స్కూల్ యాజమాన్యం నిర్వహించే క్లీన్ అండ్‌గ్రీన్ కార్యక్రమానికి వెళ్లండి అంటూ అధికారులు హుకుం జారీచేశారు. దీంతో పట్టణంలో తెల్లవారే సరికి రోడ్లపై కనిపించే పారిశుద్ధ్య కార్మికులు కనిపించలేదు.. ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయింది. ఆదివారం ఉదయం నుంచి మున్సిపల్ సిబ్బంది, అధికారులు అందరూ టీడీపీ నేత స్కూల్ సేవలో ఉండిపోయారు. దీంతో పట్టణవాసులకు ‘చెత్త’ సమస్య తప్పలేదు. – రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment