మదనపల్లె : మండలంలోని కోటవారిపల్లె తాండాలో ఆదివారం మదనపల్లె,రాయచోటి ఎకై ్సజ్ అధికారులు ఉమ్మడి దాడులు నిర్వహించినట్లు మదనపల్లె ఎకై ్సజ్ సీఐ భీమలింగ తెలిపారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 200 లీటర్ల ఊటను ధ్వంసం చేసి, 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. తాండాకు చెందిన బి.కుమార్‌నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజు ఎస్.ఐ జబీవుల్లా, ఈఎస్‌టీఎఫ్ రాయచోటి ఎక్‌పైజ్ సీఐ ఎల్లయ్య, ఎస్.ఐ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
నందలూరు: మండలంలోని నల్లతిమ్మయ్యగారిపల్లి గ్రామానికి చెందిన రామిశెట్టి సుబ్బరాయుడు (54) చెయ్యేరులోని గుంతలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈత కొడుతుండగా ఈ సంఘటన జరిగింది.
ట్రాక్టర్‌ను ఢీ కొన్న కంటైనర్
కడప–చైన్నె జాతీయ రహదారిలో మూసివేసిన ఆల్విన్ కర్మాగారం సమీపంలో ఆదివారం సాయంత్రం గుండ్లూరు నుంచి సిమెంటు ఇటుక దిమ్మెలతో ఒంటిమిట్టకు వెళ్తున్న ట్రాక్టర్‌ను కడప నుంచి తిరుపతికి వెళ్తున్న కంటైనర్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పాఠశాలల సమయాన్ని పెంచడం సరికాదు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల సమయాన్ని పెంపుదల చేయడం సరికాదని ఏపీటీఎఫ్ రాష్ట ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడపలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment