మదనపల్లె జూనియర్ వెటర్నరీ అధికారికి జాతీయ అవార్డు
మదనపల్లె : దేశంలో పశుసంవర్థక పాడిపరిశ్రమ రంగంలో అత్యున్నత పురస్కారమైన జాతీయ గోపాలరత్న అవార్డుకు అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వేంపల్లె ప్రాంతీయ పశువైద్యశాల జూనియర్ వెటర్నరీ అధికారి (జెవీఓ)డాక్టర్ వి.అనిల్‌కుమార్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయి గోపాల్‌రత్న అవార్డుల్లో మూడో స్థానం పొందారు. దక్షిణాది రాష్ట్రాల్లో అవార్డుకు ఎంపికై న ఏకై క వ్యక్తి కావడం గమనార్హం. పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో కృత్రిమ గర్భధారణ, పాల ఉత్పత్తి పెంపు, పాడి ఆవుల రెండు ఈతల మధ్య వ్యవధి కాలం, చూలు నిలిచిన శాతం, దూడలు ఈనిన శాతం తదితర ఆంశాలలో ప్రతిభ చూపిన ముగ్గురికి ఏటా దేశవ్యాప్తంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఒడిస్సా రాష్ట్రం సుబర్నాపూర్‌కు చెందిన భాస్కర్‌ప్రదాన్, రాజస్థాన్ రాష్ట్రం హన్‌మాన్‌ఘర్‌కు చెందన రాజేంద్రకుమార్ మొదటి స్థానం పొందగా, రాజస్థాన్ హన్‌మాన్‌ఘర్‌కు చెందిన వీరేంద్రకుమార్ షైనీ రెండో స్థానం పొందారు. అనిల్‌కుమార్ దక్షిణాది రాష్ట్రాల నుంచి మూడవ స్థానం పొందారు. ఈనెల 26వతేదీ (మంగళవారం) ఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో జరిగే జాతీయ పాలదినోత్సవం (నేషనల్ మిల్క్ డే) సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో అవార్డు అందుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment