జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపిక
రాయచోటి టౌన్ : అండర్ –14 జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ జట్టుకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపియ్యారు. ఆదివారం చిత్తూరు జిల్లా అరకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన 68వ రాష్ట్ర స్థాయి అండర్ –14 సాఫ్ట్‌బాల్ ఆటల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వెంకటేశు, భవంత్ సాగర్, సుండుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అభి, రెడ్డివారిపల్లెకు చెందిన రాజేష్ ఉన్నారు. వీరితో పాటు మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అనూష, లక్ష్మీప్రసన్న, సన్నీ అనే ముగ్గురు బాలికలు కూడా ఎంపికయ్యారు. వీరు జనవరి నెలలో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని పీడీలు జగదీశ్వరయ్య (మాసాపేట), వేణుమాధవ్ రాజు (వీరబల్లె), సుబ్రహ్మణం (కోడూరు) తెలిపారు. కాగా, రాయచోటి మాసాపేట జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు (బాలుర విభాగం) ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయి విజేతగా నిలవడం పట్ల ఆ పాఠశాల పీడీ జగదీశ్వరయ్య హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment