మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. తెట్టు గ్రామానికి చెందిన కిట్టప్ప భార్య నాగసుబ్బమ్మ(48) కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపం చెంది ఇంటి వద్దే నిద్రమాత్రలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
జూదరుల అరెస్టు
ఓబులవారిపల్లె : మండలంలో పలుచోట్ల పేకాట, కోడిపందేల స్థావరాలపై ఎస్‌ఐ మహేష్ సిబ్బందితో కలిసి దాడి చేసి 21 మందిని అరెస్టు చేసినట్లు రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వారివద్ద నుంచి రూ.25,600 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.
విద్యుత్ షాక్‌తో 16
పందులు, ఒక కుక్క మృతి
రాయచోటి టౌన్ : విద్యుత్ షాక్‌తో 16 పందులు, ఒక కుక్క మృత్యువాత పడ్డాయి. బాధితుల కథనం మేరకు.. రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డులోని ఎస్టీ కాలనీలో నివాసం ఉండే సప్పిడి పెద్ద పోలేరయ్య, శ్రీరాములు, సుంకయ్యలు పందులు మేపుకొని జీవనం సాగిస్తుంటారు. వీరి పందులు రోజులాగే మేత మేసి ఇంటికి వస్తున్న సమయంలో సమీపంలో రోడ్డుపై నిర్మించిన తూముల కింద కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురై అవి మృత్యువాత పడ్డాయి. రాయచోటి పశుసంవర్థక సహాయక సంచాలకుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
జూదరుల అరెస్టు
అట్లూరు : లంకమల్లేశ్వర అభయారణ్యం పరిధిలోని రామలింగేశ్వర ఆలయం దగ్గర ఆదివారం తెల్లవారు జామున మంగతాయి ఆడుతున్న 20 మంది జూదరులను అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.1,84,760లు నగదు, 20 సెల్‌ఫోన్లు, ఒక ఐషర్ ఆల్విన్ వాహనంతో పాటు 6 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రాసాధ్ తెలిపారు. పట్టుబడిన వారిలో బద్వేలు మండలం సిద్దుగారిపల్లికి చెందిన ఇద్దరు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన 18 మంది ఉన్నారన్నారు. ముందస్తు సమాచారంతో చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. బద్వేలు రూరల్ సీఐ నాగభూషణం, అట్లూరు ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment