మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దమండ్యం మండలం వెలిగల్లుకు చెందిన గుర్రప్ప కుమారుడు వెంకటరమణ(60) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. అదేవిధంగా పుంగనూరు మండలం వనమలదిన్నెకు చెందిన జయచంద్ర(37) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సాగు అవసరాల కోసం పలుచోట్ల అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిడి అధికం కావడంతో శనివారం రాత్రి ఇంటివద్దే పురుగుమందు తాగాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు, బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
వృద్ధురాలిపై దాడి
కురబలకోట : కురబలకోటకు చెందిన వృద్ధురాలు బావాబీ (83)పై ఆమె తనయుడు దాడి చేశాడు. ఈమెకు ముగ్గురు సంతానం. అయినా ఒంటరి జీవితం గడుపుతోంది. భర్త నుంచి సంక్రమించిన భూమిలో సాగు చేసిన జొన్నపంటను ఆమెకు తెలియకుండా విక్రయించడంతో నిలదీసింది. దీంతో ఆగ్రహించిన కుమారుడు ఆమైపె దాడి చేసి గాయపరిచాడు. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment