తలనీలాల కోసం 4న వేలంపాట
సిద్దవటం: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పించుకునే తలనీలాల పోగు హక్కు కోసం ఈనెల 4వ తేదీ బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. సిద్దవటంలోని రంగనాయక స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు వేలంపాట జరుగుతుందని ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.నిత్యపూజ స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరగుతాయన్నారు. వేలం పాటలో పాల్గొనే వారు ధరావత్తు కింద లక్ష రూపాయలు చెల్లించాలన్నారు. మిగిలిన షరతులను వేలం పాట సమయంలో తెలియజేస్తామని ఆయన చెప్పారు.
8న నవోదయ
విద్యాలయ ప్రవేశపరీక్ష
రాజంపేట: నవోదయ విద్యాలయ ప్రవేశపరీక్ష ఈనెల 8న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.గీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజంపేట మండలం నారమరాజుపల్లె వద్ద ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వతరగతిలో (2025–2026) సంవత్సరానికి పరిమితసీట్ల కోసం ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. 9వ తరగతి విద్యార్ధులకు రాజంపేటలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 11వ తరగతి విద్యార్థులకు నవోదయ విద్యాలయం, నారమరాజుపల్లెలో పరీక్షా కేంద్రంగా ఏర్పాటుచేశామన్నారు.అభ్యర్థులు వెబ్‌ౖసైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.విద్యార్థులకు సమస్యలు ఎదురైతే 7013635980, 9398780145, 9490466759 నంబర్లలో సంప్రదించాలన్నారు.
గంగమ్మా..కాపాడమ్మా
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు గంగరాజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గంగమ్మా..అందరూ చల్లగా ఉండేలా కరుణించి కాపాడు తల్లీ అని వేడుకున్నారు.పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
5న జాబ్ మేళా
కడప ఎడ్యుకేషన్: కడప కాగితాలపెంటలోని ప్రభుత్వ డీఎల్‌టీసీ/ఐటీఐలో 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు శ్రీకాళహస్తికు చెందిన ఎలక్ట్రోస్టిల్ కాస్టింగ్ లిమిటెడ్, కడపకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, రేణిగుంట అమర్‌రాజాతోపాటు కడపలోని మరిన్ని కంపెనీలు హాజరవుతాయని పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులకు నెలకు జీతం రూ. 13 వేల నుంచి రూ. 18 వేల వరకు ఉంటుందని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత మార్కుల జాబితాలు, రెండు ఫొటోలు, ఆధార్‌కార్డు, బయోడేటా, జిరాక్స్ కాపీలతో నేరుగా జాబ్‌మేళాకు హాజరు కావాలని ఏడీ రత్నరాజు తెలిపారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
రామాపురం: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బాగా చదివి మంచి మార్కులతో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కొంత మంది డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యసాధనకు కష్టపడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment