విద్యార్థి నేతల అరెస్టు దుర్మార్గం
రాయచోటి అర్బన్ : ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, నిర్బంధించడం దుర్మార్గమని దళితహక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండెం సుధీర్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంబేపల్లెలో జరిగిన సీఎం చంద్రబాబు బహిరంగ సభలో విద్యార్థి సంఘాల నేతలు సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు పోలీసులు అనుమతించకపోవడంతోనే వారు నిరసన తెలిపారన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థి సంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం తగదన్నారు. సమావేశంలో డీహెచ్‌పీస్ నాయకులు రెడ్డి సుధాకర్, పెద్ద గంగయ్య పాల్గొన్నారు. కాగా, అన్యాయాన్ని ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేయడం, నిర్బంధించడం ద్వారా ఉద్యమాలను ఆపలేరని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నరసింహ, డి.వి.రమణ, శెట్టిపల్లె సాయికుమార్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment