●అధిగమించాలిలా....
● గతంలో పది,ఇంటర్,జెఈఈ పరీక్షలు రాసిన సీనియర్ విద్యార్థులు ఎలా సన్నద్ధమయ్యారో తెలుసుకుని అందుకు తగ్గ టైం టేబుల్ రూపొందించుకుని ఆచరించాలి.
● చదవకపోతున్నా ..ఇంకేమైన ఆందోళనతో బాధపడుతుంటే వెంటనే తల్లిదండ్రులతో పంచుకోవాలి.
● చదవకపోతే టీచర్లు దండిస్తారని, మార్కులు తగ్గితే తల్లిదండ్రులు ఆగ్రహిస్తారని భావించి వారికి దూరంగా ఉండకూడదు. ఆ సమయంలో వారిచ్చే సూచనలు ఉపకరిస్తాయి.
● నిత్యం మానసిక ప్రశాంతత కోసం యోగా చేయించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి.
● విద్యార్థి ఒత్తిడికి గరవుతున్నాడని భావిస్తే తల్లిదండ్రులు అతనితో సరదాగా గడపాలి. ఈ సమయంలో పుస్తకాలు పక్కన పెట్టించాలి.
● పరీక్షలు ముగిసే వరకు టీవీలు, సెల్‌ఫోన్ల వాడకానికి స్వస్తి పలకాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు నచ్చజెప్పాలి. ఏది చేసినా పిల్లల సమ్మతితో చేస్తే మానసికంగా వారు అందుకు సంసిద్ధమవుతారు.
● తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవాలి. కచ్చితంగా 7–8 గంటల సేపు నిద్రపోవాలి.
Comments
Please login to add a commentAdd a comment