ఈరాశి వారికి అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి | Daily Horoscope Aug 29 2024 Telugu Rasi Phalalu Today | Sakshi
Sakshi News home page

ఈరాశి వారికి అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి

Published Thu, Aug 29 2024 6:46 AM | Last Updated on Thu, Aug 29 2024 6:53 AM

Daily Horoscope Aug 29 2024 Telugu Rasi Phalalu Today

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.ఏకాదశి తె.3.35 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉ.ఆరుద్ర రా.7.57 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు, అమృత ఘడియలు: ఉ.10.02 నుండి 11.36 వరకు. 

మేషం: నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు.  ఆకస్మిక ధనలాభ సూచనలు. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.

వృషభం: ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలల్లో తొందరవద్దు. ఉద్యోగాల్లో చిక్కులు.

మిథునం: మీ ఆశయాలు నెరవేరతాయి. పనుల్లో  పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది.

కర్కాటకం: ఆదాయం అంతగా అనుకూలించదు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యం. ఉద్యోగులకు ఇబ్బందులు.

సింహం: ఉత్సాహంగా  కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంçఘటనలు.  కొత్త వ్యాపారాలకు శ్రీకారం. చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి.

కన్య: కార్యక్రమాలలో  విజయం. దైవచింతన పెరుగుతుంది. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత చేకూరుతుంది.

తుల: .ముఖ్యమైన పనుల్లో  ఆటంకాలు. కష్టించినా  ఫలితం కనిపించదు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొద్దిగా చికాకులు.

వృశ్చికం: దూరప్రయాణాలు ఉంటాయి. శారీరక  రుగ్మతలు. బంధువర్గంతో  మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.

ధనుస్సు: కార్యజయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

మకరం: రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కార్యజయం. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి.

కుంభం: కొత్త రుణయత్నాలు, ఆర్థికంగా ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కార్యక్రమాలలో . అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

మీనం: కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా.  రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement