Daily Horoscope: ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..! | Today Telugu Horoscope On July 2nd, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..!

Published Tue, Jul 2 2024 6:25 AM | Last Updated on Tue, Jul 2 2024 8:29 AM

Daily Horoscope On July 02, 2024 In Telugu

శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు; జ్యేష్ఠ మాసం; తిథి: బ.ఏకాదశి ఉ.8.57 వరకు, తదుపరి ద్వాదశి; నక్షత్రం:  భరణి ఉ.6.18 వరకు, తదుపరి కృత్తిక తె.4.58 వరకు (తెల్లవారితే బుధవారం); వర్జ్యం:  సా.5.49 నుండి 7.20 వరకు; దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 9.01 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.40 వరకు; అమృత ఘడియలు: రా.3.02 నుండి 4.33 వరకు; 

మేషం: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం: చిత్రమైన సంఘటనలు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆకస్మిక ధనలాభం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూల సమాచారం.

కర్కాటకం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు కొంత ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం: సన్నిహితులతో వివాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వివాహ, ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కన్య: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలలో అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం. ముఖ్యమైన పనులు వాయిదా. వ్యాపారాలు సామాన్యస్థితిలో ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

ధనుస్సు: దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. సోదరులు, మిత్రులతో కలహాలు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

మకరం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

కుంభం: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. బంధువులతో వైరం. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మీనం: రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement