Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి | Today Telugu Horoscope On July 4th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి

Published Thu, Jul 4 2024 6:45 AM | Last Updated on Thu, Jul 4 2024 9:12 AM

Daily Horoscope On July 03, 2024 In Telugu

శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.5.38 వరకు, తదుపరి చతుర్దశి, తె.4.25 వరకు(తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం: మృగశిర తె.4.20 వరకు(తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.10.00 నుండి 11.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.46 వరకు, తదుపరి ప.3.07 నుండి 4.00 వరకు, అమృతఘడియలు: రా.7.38 నుండి 9.12 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.33, సూర్యాస్తమయం: 6.35, మాసశివరాత్రి. 

మేషం...చేపట్టిన పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం...శుభవార్తలు అందుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి సహాయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మిథునం....వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. రాబడికి మించి ఖర్చులు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.

కర్కాటకం....పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహం...ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య....శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

తుల....కుటుంబసమస్యలు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం.....పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు...వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం...ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

కుంభం...వ్యవహారాలలో అవరోధాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు కాస్త నిరాశ పరుస్తాయి.

మీనం.....కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, సోదరుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement