![కూరగాయలు, ఆకుకూరల
తోటను పరిశీలిస్తున్న ఎస్పీ - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/28/27nrpt07-150137_mr_1.jpg.webp?itok=N3gNoXng)
కూరగాయలు, ఆకుకూరల తోటను పరిశీలిస్తున్న ఎస్పీ
నరసరావుపేట: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సేంద్రియ విధానంతో పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల తోటను జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. పల్నాడు జిల్లా ఏర్పడిన తొలిరోజుల్లో పోలీస్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అవసరార్ధం ఈ తోటను వేయించా రు. సిబ్బందికి బయట భోజన సదుపాయ వసతు లు ఇబ్బందిగా ఉండటంతో ప్రత్యేక శ్రద్ధతో కార్యాలయ ఆవరణలో ఈ ఏడాది ఏప్రిల్‌లో భోజనశాల ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ తోటలో సేంద్రీయ పద్ధతిలో పండిన కూరగాయలు, ఆకుకూరలతో తయారుచేసిన వంటకాలతో ప్రతిరోజు కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి భోజన సదుపాయం నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. భోజనశాలలో సిబ్బంది కోసం తయారు చేసిన ఆహార పదార్ధాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తోటను సాగు చేస్తున్న సిబ్బంది, వీరికి దిశానిర్దేశం చేస్తున్న హోంగార్డు ఆరై రవికిరణ్‌ను అభినందించారు. నిత్యం అనేక విధుల్లో తనమునకలై ఉంటున్న జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటను సబ్సిడీ భోజనశాల ద్వారా అందిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ విధంగా పండిన వాటితో ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, భవిష్యత్‌లో కూడా ఈ విధంగానే పండించిన సేంద్రియ పంటతో పోలీస్ సిబ్బందికి ఆహారాన్ని అందించాలని పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు డి.రామచంద్రరాజు, ఎస్‌కే.చంద్రశేఖర్, ఎస్పీ సీఐ ప్రభాకర్, ఆరై రవికిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment