![ఐఏ, ఏ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mgl12-150197_mr-1739218478-0.jpg.webp?itok=hqSUa7Kq)
ఐఏ, ఏడీ సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
మంగళగిరి: నగర పరిధిలోని నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లో గల ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఐఏ, ఏడీ సౌత్ జోన్–2025 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలుత ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి జట్టు – కేరళ రాష్ట్రాల మధ్య మ్యాచ్ జరగగా కేరళ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కేరళ జట్టు బౌలింగ్‌ను ఎంచుకోగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర–తెలంగాణ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 96 పరుగులు చేసింది. 97 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కేరళ జట్టు 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 100 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. ఆంధ్ర–తెలంగాణకు చెందిన బ్యాట్స్‌మెన్ రవితేజ 40 పరుగులు, ఎస్ కొఠారి 26 పరుగులు చేయగా కేరళ జట్టు బౌలర్ అంకిత మిశ్రా 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి రాణించాడు. రెండవ మ్యాచ్‌లో తమిళనాడు–కర్నాటక జట్లు తలపడగా తమిళనాడు కర్నాటకపై మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన తమిళనాడు జట్టు బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ చేసిన కర్నాటక జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. జట్టు బ్యాట్స్‌మెన్ హెచ్.అర్జున్ 47 పరుగులు, శరత్ బీఆర్ 40 పరుగులు జె సుజిత్ 31 పరుగులు చేసి రాణించారు. 170 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన తమిళనాడు జట్టు చివరి ఓవర్ చివర బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో విజయం సాధించింది. తమిళనాడు జట్టులో భరద్వాజ్ 83 పరుగులు, విఘ్నేష్ 27 పరుగులతో రాణించారు. నిర్వాహకులు భాస్కర్ కల్లూరి, కిషోర్ రెడ్డి, రాకేష్ నాయక్, ఎన్.నిఖిల్‌లు జెండా ఊపి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో అత్త్యుతమ ప్రతిభ కనపరచిన క్రికెటర్ నీలం మణిశ్రావణిని అభినందించి బహుమతి ప్రదానం చేశారు.
తొలిరోజు ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి జట్టుపై కేరళ విజయం కర్నాటకపై తమిళనాడు జట్టు జయకేతనం
![ఐఏ, ఏడీ సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10mgl10-150197_mr-1739218478-1.jpg)
ఐఏ, ఏడీ సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment