మహిళా కూలీల మృతి బాధాకరం | - | Sakshi
Sakshi News home page

మహిళా కూలీల మృతి బాధాకరం

Published Tue, Feb 11 2025 1:58 AM | Last Updated on Tue, Feb 11 2025 1:58 AM

మహిళా

మహిళా కూలీల మృతి బాధాకరం

సత్తెనపల్లి: పొట్టకూటి కోసం మిరపకాయలు కోసేందుకు వెళ్లిన మహిళా కూలీలు నలుగురు మృతి చెందడం బాధాకరమని వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి పేర్కొన్నారు. ముప్పాళ్ళ మండలం బొల్లవరం కాలువ కట్టపై ట్రాక్టర్‌ బోల్తా పడి మృతి చెందిన మహిళ కూలీల మృతదేహాలను పట్టణంలోని ఏరియా వైద్యశాలలో సోమవారం ఆయన సందర్శించి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ఓదార్చి వారికి అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఆయనతోపాటు వైఎస్సార్‌ సీపీ ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు నక్కా శ్రీనివాసరావు, నాయకులు ఎంజేఎం రామలింగారెడ్డి (చిన్నా), గోలమారి వెంకట్రా మిరెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): ట్రాక్టర్‌ బోల్తా ప్రమాదంలో మృతి చెందిన నలుగురు వ్యవసాయ కూలీల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జెల సుధీర్‌భార్గవరెడ్డి చెప్పారు. సోమవారం గ్రామానికి వచ్చిన ఆయన నాలుగు మృతదేహాలను సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. మరణించిన మాధవి ఇద్దరు చిన్నారులకు అండగా ఉంటానని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన రామలింగమ్మ ఇంటికి వెళ్ళి వైద్యసేవలందించి, మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని వైద్యశాలకు రావాలని సూచించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు ఎమ్‌జెఎమ్‌రామలింగారెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, మధిర శ్రీనివాసరెడ్డి, మధిర వెంకటేశ్వరరెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రగాఢసానుభూతి తెలిపిన

డాక్టర్‌ సుధీర్‌భార్గవ్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
మహిళా కూలీల మృతి బాధాకరం 1
1/1

మహిళా కూలీల మృతి బాధాకరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement