ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
మాచవరం: మోర్జంపాడులో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు జాతి వృషభరాజముల జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. జూనియర్ విభాగం పోటీలను సోమవారం మాజీ ఎమ్మెల్సీ, టీటీడీ పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. తొలుత ఆయన గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేశారు.
● ఆరుపళ్ల విభాగంలో అత్తోట శిరీషచౌదరి, శివకృష్ణ చౌదరి (వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా) ఎడ్లు 5120.9 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. రామినేని రత్తయ్య చౌదరి (తోటపాలెం, చేబ్రోలు మండలం, గుంటూరు), ఏటుకూరి శ్రీనివాసరావు (పెదకూరపాడు, పల్నాడు జిల్లా) కంబైన్డ్ జత 4234.6 అడుగులు దూరాన్ని లాగి రెండో స్థానంలో నిలిచాయి. అనంతనేని శ్రీకావ్య శ్రీమధు (యనమలకుదురు, పునమలూరు, కృష్ణా జిల్లా) ఎడ్లు 4214.2 అడుగులు, గరికపాటి లక్ష్మయ్యచౌదరి (పెదగొట్టిపాడు, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా), రాయుడు సుబ్బారావు (గంగపాలెం,బల్లికురవ మండలం, బాపట్ల జిల్లా) కంబైన్డ్ జత 4191.2 అడుగులు, నలమాద ఉత్తమ పద్మావతిరెడ్డి (ఎమ్మెల్యే, కోదాడ, తెలంగాణ) ఎడ్లు 4000 అడుగులు, మేకా అంజిరెడ్డి (చల్లగుండ్ల, నెకరికల్లు మండలం, పల్నాడు జిల్లా) ఎడ్లు 3963.9 అడుగులు, కంచేటి రాజ్యలక్ష్మి శ్రీనివాసరావు (గుమ్మడిదూరు, పెదకంచిప్రోలు మండలం, ఎన్‌టీఆర్ జిల్లా) ఎడ్లు 2600 అడుగుల దూరాన్ని లాగి వరుస బహుమతులు అందుకున్నాయి.
● న్యూ కేటగిరి సేద్యం విభాగంలో అత్తోట శిరీషచౌదరి, శివకృష్ణ చౌదరి (వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా) ఎడ్లు 4935.6 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతిని దక్కించుకున్నాయి. వజ్రాల తేజశ్రీరెడ్డి ( సంతమాగులూరు, బాపట్ల జిల్లా), ఎడ్లు 4800 అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానంలో నిలవగా, తోట శ్రీనివాసరావు ( కొప్పురావూరు, పెదకాకాని మండలం, గుంటూరు) ఎడ్లు 4754.9 అడుగులు, గరికపాటి లక్ష్మయ్యచౌదరి (పెదగొట్టిపాడు, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా) ఎడ్లు 4400 అడుగులు, సంపటం వీరబ్రహ్మం నాయుడు (ఉయ్యందన, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లా, ఎడ్లు 4302.3 అడుగులు, కొలుసు శ్రీనివాసరావు యాదవ్, వెంకటేశ్వర యాదవ్ (తెంపల్లి, గన్నవరం, కృష్ణా జిల్లా) ఎడ్లు 4200 అడుగులు, జక్కుల సహస్ర యాదవ్, డాక్టర్ హుస్సేన్ (కోదాడ, తెలంగాణ4068.1 అడుగుల దూరాన్ని లాగి వరుస స్థానాల్లో నిలిచి, బహుమతులు అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment