ఇసుక దొరక్క బతుకులో చీకట్లు | - | Sakshi
Sakshi News home page

ఇసుక దొరక్క బతుకులో చీకట్లు

Published Thu, Oct 10 2024 2:46 AM | Last Updated on Thu, Oct 10 2024 2:46 AM

ఇసుక

బాపట్ల టౌన్‌: ‘‘ మేము అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా అందజేస్తాం.. కొరత లేకుండా చూస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇసుక అందించడమే మా లక్ష్యం’’ అంటూ ఎన్నికలకు ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు కూటమి నేతలు. అధికారంలోకి వచ్చాక ఉచితంగానే అందిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. ఉచితం సంగతి దేవుడెరుక...ట్రక్కు ఇసుక రూ. 7 నుంచి 10 వేలు చెల్లించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. వేలాది రూపాయలు చెల్లించినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణాలను యజమానులు అర్ధంతరంగా ఆపేశారు. దీంతో పనుల్లేక భవననిర్మాణ కార్మికులు పొట్ట కూటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

ప్రభుత్వ ఆచరణేది ?

కూటమి నేతల ఉచిత ఇసుక హామీ బూటకంగా మారింది. పనులు అర్ధతరంగా నిలిచిపోతున్నాయన్న బాధతో ఇంటి యజమానులు అర్ధరాత్రి ట్రాక్టర్లు, ఎద్దుల బండితో దొంగతనంగా తోలుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా ఒక్కో ట్రాక్టర్‌ రూ. 8 నుంచి 10 వేలు వరకు చెల్లించాల్సి వస్తోంది. ఎద్దుల బండి అయితే ఏకంగా రూ. 3500 చెల్లిస్తేనే ఇసుక తోలుతున్నారు. ఇదేనా ఉచితం అంటే అంటూ భవన నిర్మాణ యజమానులు కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.

ఇసుక లేకపోవడంతోనే ఈ పరిస్థితి

నేను తాపీమేసీ్త్రగా పని చేస్తుంటాను. నేను పనిచేసే చోట ఆగస్టులో కొత్త గృహానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. అక్కడే మూడు నెలల వరకు పని దొరికేది. ప్రస్తుతం ఇసుక లేకపోవడంతో యజమాని పనులు ఆపేశారు. దీంతో ప్రతిరోజు పని దొరుకుతుందేమోనన్న ఆశతో రావడం, నిరాశతో వెనుతిరిగి వెళ్లటమే జరుగుతోంది.

– ఎం. అనిల్‌కుమార్‌రెడ్డి, రెడ్డిపాలెం, పిట్టలవానిపాలెం మండలం

జిల్లా కేంద్రమైన బాపట్ల గడియార స్తంభం సెంటర్‌కు ప్రతిరోజు 200 మంది భవన నిర్మాణ కార్మికులు పనుల నిమిత్తం వస్తుంటారు. వీరంతా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. పనుల కోసం వచ్చి నిరాశతో వెనుతిరుగుతున్నారు. గడిచిన రెండు నెలలుగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో చేతిలో పనుల్లేక...పూట గడవక కార్మికులు అల్లాడిపోతున్నారు. ప్రతిరోజూ చార్జీలు పెట్టుకొని పనుల కోసం వేకువజామునే గడియార స్తంభం సెంటర్‌కు చేరుకోవడం, మధ్యాహ్నం 11 గంటల వరకు అక్కడే పడిగాపులు పడుతున్నారు. చివరికి పనుల్లేక నిరాశతో వెనుతిరుగుతున్నారు.

పనుల కోసం ఎదురు చూస్తున్న కూలీలు

పనుల కోసం భవన నిర్మాణ కార్మికులు పడిగాపులు ఇసుక లేక రెండు నెలలుగా అవస్థలు కూటమి ప్రభుత్వం రాకతో కుదేలైన భవన నిర్మాణ రంగం ఉచితం అంటూ ఆర్భాటంగా ప్రకటన పస్తులతో కాలాన్ని వెళ్లతీస్తున్న కూలీలు ట్రక్కు ఇసుక రూ. 8వేలు

No comments yet. Be the first to comment!
Add a comment
ఇసుక దొరక్క బతుకులో చీకట్లు 1
1/1

ఇసుక దొరక్క బతుకులో చీకట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement